వాట్సప్‌ను తెగ వాడేస్తున్న భారత్.. 41 శాతం పెరిగిన యూజర్లు
29-03-202029-03-2020 09:08:32 IST
2020-03-29T03:38:32.956Z29-03-2020 2020-03-29T03:38:31.048Z - - 14-04-2021

కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో జనజీవితం స్తంభించిపోయిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో కీలకమైన వాట్సాప్, ఫేస్‌బుక్‌లను దేశ ప్రజలు వాడిపడేస్తున్నారని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి కాళ్లు బయటపెట్టలేని పరిస్థితి కారణంగా ప్రజలంతా సామాజిక మాధ్యమాలపై పడ్డారు. దీంతో వాట్సప్, ఫేస్‌బుక్‌ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో సోషల్ మీడియా దిగ్గజం వాట్సప్‌లో నెటిజన్లు గడిపే కాలం అమాంతం పెరిగిపోయింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మొదట్లో 27 శాతం పెరిగిన యూజర్ల సంఖ్య.. కరోనా మొదట దశ ముగిసే సరికి ఆ సంఖ్య 41 శాతానికి పెరిగింది. ఇక వైరస్ రెండోదశకు చేరుకుని తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ.. ఏకంగా 51శాతానికి పెరిగిందని ఓ సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. వీరిలో 40శాతానికిపైగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల వారేకావడం గమనార్హం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్ వాడకం 50శాతం పెరిగిందని ఆ సంస్థ తన సర్వేలో పేర్కొంది. వాట్సప్‌తో పాటు మెస్సెంజర్ వాడకంలో 70శాతం ఇటలీ తొలిస్థానంలో నిలవగా.. వీడియో కాల్స్ మాట్లడం ఒక్కసారిగా 1000శాతం పెరిగింది. కాగా భారత్‌తో పాటు ప్రపంప వ్యాప్తంగా పలు దేశాల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. వీరంత సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఇక సెలబ్రెటీలు సైతం సోషల్ మీడియా ద్వారా కరోనాపై ప్రజలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. దీంతో వారిని అనుసరించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు పలు సాఫ్ట్వేర్ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం (ఇంటి నుంచి పని) పద్దతిని అవలంభిస్తున్నాయి. దీంతో ఉద్యోగులంతా సమాచారం కోసం వాట్సప్ గ్రూపులు, వీడియోలు కాల్స్ చేయడం ఎక్కువగా జరుగుతోంది. దీంతో సాధారణంగానే సోషల్‌మీడియా వాడటం పెరుగుతోంది. అంతేకాక సోషల్ మీడియాలో యువత ముచ్చట్లు, చాటింగ్స్ కూడా ఎక్కువే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాపై చేస్తున్న హెచ్చరికలను కూడా వాట్సాప్ అందిస్తుండటంతో ప్రజలు వాట్సాప్ పట్ల గతంలో కంటే మక్కువ పెంచుకుంటున్నారు. తమ సంస్థ ఇటీవలే ప్రారంభించిన డబ్ల్యూహెచ్ఓ హెల్త్ అలర్ట్‌పై ఇప్పటికే 10 లక్షలమంది ప్రజలు సైన్ చేశారని వాట్సాప్ అధినేత విల్ కాత్‌కార్ట్ చెప్పారు. ప్రజలకు మంచి, కచ్చితమైన, నమ్మదగిన సమచారాన్ని ఇస్తున్నాం కాబట్టే మాపై ఆదరణ పెరుగుతోందని, దీనికి తామెంతో సంతోషిస్తున్నట్లు విల్ చెప్పారు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా