newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వర్క్ ఫ్రం హోం.. జియో యూజర్లకు అదనపు డేటా

16-05-202016-05-2020 11:13:06 IST
2020-05-16T05:43:06.698Z16-05-2020 2020-05-16T05:42:17.956Z - - 20-04-2021

వర్క్ ఫ్రం హోం.. జియో యూజర్లకు అదనపు డేటా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులు దాదాపు అంతా వర్క్ ఫ్రం హోం వైపు అడుగులు వేశారు. గత రెండునెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రతి రోజూ  3 జీబీ డేటాతో సరికొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌ను ప్రకటించింది రిలయెన్స్ జియో. ఈ ప్లాన్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ.999 అంటే మూడు నెలల పాటు ఈ ప్లాన్ వాడుకోవచ్చు. అంటే నెలకు 333 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మూడు నెలలకు 252 జీబీ హైస్పీడ్ డేటా వాడుకోవచ్చు. అంటే 1 జీబీ డేటాకు ధర రూ.4 లోపే చెల్లిస్తే చాలు. రోజూ 3జీబీ డేటా లిమిట్ పూర్తైనా డేటా వాడుకోవచ్చు. కాకపోతే స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది. రోజుకి 3 జీబీ వాడుకునేవారికి ఇంతకంటే చవకైన ప్లాన్ లేదనే చెప్పాలి. 

ఈ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. డేటాతో అనేక ప్రయోజనాలు అందిస్తోంది జియో. ఇక డేటాతో పాటు జియో నుంచి జియోకు, ల్యాండ్‌లైన్‌కు అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. జియో నుంచి ఇతర నెట్ వర్క్ కి కాల్ చేయడానికి 3వేల నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్‌‌లు వాడుకోవచ్చు. వీటితో పాటు జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ అదనంగా లభిస్తుంది.

ఇంట్లో వుండి డేటా కావాలనుకునేవారు, సినిమాలు చూసేవారికి ఈ డేటా ఉపయోగపడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మూడునెలలకు సరిపడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్‌ను రూ.999 ధరకు రూపొందించింది రిలయెన్స్ జియో. ఏడాదంతా రోజుకి 2 జీబీ కావాలనుకునేవారికి మరో ఆఫర్ అందిస్తోంది జియో. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ యాన్యువల్ ప్లాన్‌  ధర రూ.2399. మరోవైపు 336 రోజుల పాటు రోజూ 1.5 జీబీ డేటా అందించే రూ.2,121 ప్లాన్‌ను రిలయెన్స్ జియో అందుబాటులోనే వుంచింది. ఈ ప్లాన్ కంటే ఏడాదంతా 2 జీబీ డేటా బెటర్. 

మరోవైపు లాక్ డౌన్ కారణంగా వ్యాలిడిటీ అయిపోయిన ప్రీపెయిడ్ కష్టమర్లు ఒక రోజు జియో టు జియో కాల్స్ అపరిమతంగా చేసుకోవచ్చు. ఈ గ్రేస్ పీరియడ్ తరవాత ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోవాలి.  ప్రీపెయిడ్ కస్టమర్స్ ఫోన్లలో బ్యాలెన్స్ అయిపోయి, రీచార్జ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. లాక్ డౌన్ ప్రారంభంలో గడువు ముగిసిన రిలయన్స్ జియో, జియో ఫోన్ కస్టమర్లకు 100 నిముషాల ఔట్ గోయింగ్ సౌకర్యం అందించిన సంగతి తెలిసిందే. అలాగే ఇన్ కమింగ్ సౌకర్యం కొనసాగుతూనే వుంది. 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle