వన్ ప్లస్ మొబైల్స్ లో వండర్ ఫుల్ ఫీచర్లు రాబోతున్నాయ్
01-10-201901-10-2019 12:02:03 IST
2019-10-01T06:32:03.229Z01-10-2019 2019-10-01T06:32:00.813Z - - 15-04-2021

వన్ ప్లస్ మొబైల్స్ ఫీచర్లలో అభిమానులకు బాగా నచ్చే అంశాల్లో ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి. స్టాక్ అండ్రాయిడ్ స్టైల్ లోనే ఉంటూ యూజర్లకు మంచి యూజర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. బ్లాట్ వేర్ తక్కువగా ఉంటూ ఫీచర్లు ఎక్కువగా ఉంటాయి. దీనికి వన్ ప్లస్ ఇటీవల కొన్ని అదనపు ఫీచర్లను యాడ్ చేస్తూ వచ్చింది. ఇవి ఇండియా యూజర్లకు ప్రత్యేకం. ఇప్పుడు వాటికి మరిన్ని ఫీచర్లను జోడిస్తోంది.
వన్ ప్లస్ మొబైల్స్ లో కొత్తగా ఆక్సిజన్ ఎస్ ఎంఎస్ యాప్ ను తీసుకొస్తోంది. చాలా చైనా మొబైల్స్ లో ఉండే ఫీచర్లన్నీ ఇందులో ఉండబోతున్నాయి. ఈ మెసేజ్ యాప్ మీ మెసేజ్ లను ఆటోమేటిక్ గా మెసేజ్ లను సార్ట్ చేస్తుంది. అంటే బ్యాంకు మెసేజ్ లు, ప్రమోషనల్ మెసేజ్ లు, స్పామ్ మెసేజ్, వెరిఫికేషన్ కోడ్ లను డివైడ్ చేసి చూపిస్తుంది. టికెట్లు, బిల్స్ లాంటి వాటిని సులభంగా చదవగలిగేలా ఈ యాప్ మార్పు చేసి చూపిస్తుంది.
వన్ ప్లస్ కొత్తగా వన్ ప్లస్ రోమింగ్ అనే ఆప్షన్ ను తీసుకొస్తోంది. దీని ద్వారా అంతర్జాతీయంగా సిమ్ ఫ్రీ డేటా సర్వీసు ను వాడుకోవచ్చు. ఈ ఫీచర్ ని వన్ ప్లస్ గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు మరోసారి కన్ఫర్మ్ చేసింది. దీంతోపాటు కొత్త ఆక్సిజన్ ఓఎస్‌లో ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’ ఆప్షన్ రాబోతోంది. దీని ద్వారా నోటిఫికేషన్లను సాగ్రిగేట్ చేయొచ్చు. అంటే వ్యక్తిగత మెసేజ్ లు, వర్క్ కు సంబంధించిన నోటిఫికేషన్లు వేర్వేరుగా చూడొచ్చు.
ఫొటో గ్యాలరీ యాప్ ను కూడా వన్ ప్లస్ మార్చబోతోంది. గూగుల్ ఫొటోస్ స్టైల్లోనే ఆక్సిజన్ ఓఎస్ లో కొత్త ఫొటోస్ యాప్ రాబోతోంది. ఫొటో గ్యాలరీ యాప్ క్లౌడ్ స్టోరేజీ ఫీచర్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. దీంతోపాటు ఫేస్ రికగ్నిషన్, టైమ్, లొకేషన్ లాంటి ఫీచర్లు తీసుకురాబోతున్నారు. వీటితోపాటు క్రికెట్ రిజల్ట్స్ మరింత ఆకర్షణీయంగా ఉండబోతోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా