newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

వన్ ప్లస్ ఫోన్ కంటే సన్నగా స్మార్ట్ టీవీ

26-06-202026-06-2020 19:59:18 IST
2020-06-26T14:29:18.613Z26-06-2020 2020-06-26T14:29:09.821Z - - 11-07-2020

వన్ ప్లస్ ఫోన్ కంటే సన్నగా స్మార్ట్ టీవీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వన్ ప్లస్ ఫోన్లు దేశంలో ఎంత ఆదరణ పొందాయో అందరికీ తెలిసిందే. తాజాగా వన్ ప్లస్ సంస్థ స్మార్ట్ ఫోన్ కంటే సన్నగా వుండే స్మార్ట్ టీవీ రాబోతోంది. వీటితో పాటు బడ్జెట్ ధరలో మధ్యతరగతికి అందుబాటులో వుండేలా స్మార్ట్ టీవీలు రాబోతున్నాయి. ఈ టీవీల ధర రూ.69, 900 గా చెబుతోంది. ఇవి డీసీఐ పీ3, డాల్బీ విజన్ సపోర్ట్ తో అందిస్తోంది. వన్ ప్లస్ త్వరలో లాంచ్ చేయబోయే బడ్జెట్ టీవీల ధరలను కూడా వెల్లడించింది. 

ఈ టీవీలను జూలై 2వ తేదీన లాంచ్ చేయనున్నట్లు వన్ ప్లస్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు వన్ ప్లస్ ఇండియా అధికారిక ట్వీటర్ పేజ్ ద్వారా ఈ టీవీల ధరలు రూ.10,999 నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొంది. ధర ఎంతో అంచనా వేయమని ఫ్యాన్స్ కు సూచించింది. గత సంవత్సరం వన్ ప్లస్ క్యూ1, వన్ ప్లస్ క్యూ1 ప్రో టీవీలను ప్రీమియం రేంజ్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు బడ్జెట్ విభాగంపై ఈ టీవీలు రానున్నాయి. 

ఈ టీవీల ధర రూ.10,999 నుంచి రూ.19,999లోపు ఉండే అవకాశం ఉంది. రియల్ మీ ఇటీవలే రూ.12,999, రూ.21,999 ధరల్లో రెండు టీవీలను లాంచ్ చేసింది. వేర్వేరు సైజుల్లో ఈ టీవీలను లాంచ్ చేయనున్నట్లు వన్ ప్లస్ తెలిపింది,ఈ టీవీల్లో కూడా అద్భుతమైన ఫీచర్లను తక్కువ ధరకే అందించనున్నట్లు వన్ ప్లస్ తెలిపింది. దీంతో పాటు డిజైన్ విషయంలో కూడా ప్రీమియం లుక్ ను వన్ ప్లస్ అందించనుంది.

మధ్యతరగతి వారిని ఇటువైపు లాగేసేందుకు ప్రయత్నం చేస్తోంది. 2019 సెప్టెంబర్ లో వన్ ప్లస్ టీవీ క్యూ1, వన్ ప్లస్ టీవీ క్యూ1 ప్రో స్మార్ట్ టీవీలను లాంచ్ చేశాయి. ఇవి రెండూ 55 అంగుళాల 4కే క్యూఎల్ఈడీ ప్యానెళ్లతో లాంచ్ అయ్యాయి. వీటిలో వన్ ప్లస్ టీవీ క్యూ1 ధర రూ.69,900గా ఉండగా, వన్ ప్లస్ టీవీ క్యూ1 ప్రో ధర రూ.99,900గా ఉంది.గతంలో బడ్జెట్ టీవీ గురించి అంతగా పట్టించుకోని వన్ ప్లస్ సంస్థ ఇప్పుడు సామాన్యులకు చేరువ కానుంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle