newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వన్ ప్లస్ టీవీ ఫీచర్లూ... రేటు అదుర్స్

28-09-201928-09-2019 12:39:43 IST
2019-09-28T07:09:43.002Z28-09-2019 2019-09-28T07:09:38.709Z - - 22-04-2021

వన్ ప్లస్ టీవీ ఫీచర్లూ... రేటు అదుర్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకప్పుడు శాంసంగ్, ఎల్ జి, సోనీ లాంటి పేర్లు బాగా వినిపించేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. చైనా కంపెనీలు భారత మార్కెట్లోకి క్యూ కడుతున్నాయి.  ఇటీవల షావోమీ, రెడ్ మి టీవీలు ఇండియన్ మార్కెట్లో అదరగొడితే ఇప్పుడు వన్ ప్లస్ వంతు వచ్చింది. గత కొంతకాలంగా ఊరిస్తూ వచ్చిన వన్ ప్లస్ టీవీలు భారత మార్కెట్ లోకి వచ్చేశాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో తొలిసారిగా మన దగ్గరే విడుదల చేశారు. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన రెండు టీవీల ధర కూడా అదిరిపోయింది. 

వన్‌ప్లస్‌ టీవీ Q1, వన్‌ప్లస్‌ టీవీ Q1 ప్రో పేరుతో క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే తో ఈ టీవీలను వన్ ప్లస్ తీసుకొచ్చింది.  Q1 వేరియంట్‌ ధర రూ.69,900 కాగా.. Q1 ప్రో ధరను రూ.99,900గా నిర్ణయించారు. ఈ రెండు వేరియంట్లు 29 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో అమ్మకానికి తీసుకొస్తున్నారు.  ఈ రెండు వేరియంట్లు 55 అంగుళాల 4కే డిస్‌ప్లేతో వస్తున్నాయి. రెండింట్లో దాదాపు ఒకే తరహా స్పెసిఫికేషన్స్‌ ఉన్నాయి. Q1 ప్రోలో అదనంగా బిల్ట్‌ఇన్‌ మోటరైజ్డ్‌ సౌండ్‌బార్‌ ఉంటుంది.  50W సౌండ్‌బార్‌లో 8 స్పీకర్లుంటాయి. Q1లో 50w సౌండ్‌ అవుట్‌పుట్‌ ఉన్నప్పటికీ ఇందులో మోటరైజ్డ్‌ సౌండ్‌బార్‌ ఉండదు.

ఈ టీవీల్లో డాల్బీ విజన్‌, డాల్బీ అట్మాస్ సాంకేతికతలు ఉన్నాయి. ఈ టీవీలు హెచ్‌డీఆర్‌10కు సపోర్ట్‌ చేస్తాయి. గామా మేజిక్‌ కలర్‌ పిక్చర్‌ ప్రాసెసర్‌ టెక్నాలజీ ద్వారా అద్భుతమైన పిక్చర్‌ క్వాలిటీ లభిస్తుంది.  ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ తో పనిచేస్తుంది. ఈ టీవీలో ‘ఆక్సిజన్‌ ప్లే’ సర్వీసుతో కంటెంట్‌ చూడొచ్చు. హంగామా ప్లే, ఎరోస్‌ నౌ, జీ 5 లాంటి ఓటీటీ సర్వీసుల నుంచి టీవీ షోలు, సినిమాలను  వీక్షించొచ్చు. అయితే, ఇందులో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌  ఇంకా అందుబాటులో లేదు. త్వరలో అప్ డేట్ ద్వారా తీసుకొస్తున్నారు. 

వన్ ప్లస్ టీవీల్లో గూగుల్‌ అసిస్టెంట్‌ సదుపాయం ఉంది. టీవీ రిమోట్‌ ద్వారానే ఈ సర్వీసును ఉపయోగించొచ్చు. దీంతోపాటు అమెజాన్‌ ప్రైమ్‌ హాట్‌కీ, వాల్యూమ్‌ బటన్స్‌ మరికొన్ని  బటన్లు మాత్రమే ఉన్నాయి. మీ మొబైల్ ను కూడా రిమోట్‌గా ఉపయోగించుకునేలా వన్‌ప్లస్‌ కనెక్ట్‌ యాప్‌ను లాంచ్ చేశారు.  స్మార్ట్‌ఫోన్‌ వాల్యూమ్‌ బటన్ల ద్వారా టీవీ వాల్యూమ్ ను కంట్రోల్ చేయొచ్చు. ఇందులో మరో ఆసక్తికరమైన ఫీచర్ కూడా ఉంది. ఫోన్‌ను కనెక్ట్‌ చేసి టీవీ చూస్తున్నప్పుడు కాల్ వస్తే టీవీ సౌండ్‌ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   7 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle