newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వన్ ప్లస్ కు షాకిచ్చిన గూగుల్ పిక్సెల్

10-06-202010-06-2020 20:28:44 IST
Updated On 10-06-2020 20:28:36 ISTUpdated On 10-06-20202020-06-10T14:58:44.134Z10-06-2020 2020-06-10T14:49:04.625Z - 2020-06-10T14:58:36.244Z - 10-06-2020

వన్ ప్లస్ కు షాకిచ్చిన గూగుల్ పిక్సెల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో గూగుల్ పిక్సెల్ తన సత్తాను చాటుకుంది. వన్ ప్లస్ ని మించి గత ఏడాది అమ్మకాలు సాగించినట్టు గూగుల్ తెలిపింది. 2019లో 7.2 మిలియన్ల షిప్ మెంట్లు డెలివరీ చేశామని సంస్థ తెలిపింది. ఐడీసీ సర్వే ప్రకారం గూగుల్ పిక్సెల్ 2019లో భారీ స్థాయిలో అమ్మకాలు సాగించింది. గూగుల్ పిక్సెల్ మోడల్ ని సంస్థ 2016లో విడుదల చేసింది. 

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ కంటే వ్యాపారంలో ముందుంది. 52 శాతం అమ్మకాలు పెంచుకోగలిగిందని ఐడీసీ తెలిపింది. ఐడీసీ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్కో జెరోనిమో మాట్లాడుతూ గూగుల్ పిక్సెల్ ఫోన్ అమ్మకాలు భారీ వృద్ధి కనిపించిందని చెప్పారు. 

గుగుల్ పిక్సెల్ ఫోన్లకు అమెరికాతో పాటు, పశ్చిమ యూరోప్, జపాన్ లో మంచి మార్కెట్ ఉందన్నారు. వన్ ప్లస్ మోడల్స్ కంటే గూగుల్ పిక్సెల్ ఫోన్లే ఎక్కువగా అమ్మకాలు సాగిస్తున్నాయి. టాప్ 10 స్మార్ట్ ఫోన్లలో గూగుల్ పిక్సెల్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. పిక్సెల్ 3 ఏ మరియు పిక్సెల్ 4 అమ్మకాలు బాగా సాగాయి. గత ఏడాది మూడు త్రైమాసిక అమ్మకాల్లో పిక్సల్ 3 కంటే పిక్సెల్ 4 వృద్ధిని నమోదు చేసుకుంది. 

కోవిడ్ 19 వల్ల 2019 చివరినుంచి 2020 మే నెల వరకూ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు తగ్గిన సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ షిప్ మెంట్ల అమ్మకాలు 2.3 శాతం తగ్గాయి. మొత్తం 2020 నాటికి 1.339 బిలియన్ యూనిటంలె అమ్ముడు కాగా 2019లో అయితే 1.372 బిలియన్ ఫోన్లు అమ్ముడయ్యాయి. కోవిడ్ కేసుల కారణంగా 2020 మొదటి త్రైమాసికంలో చైనా ఫోన్ల అమ్మకాలు 40 శాతం తగ్గాయి. 5 జీ ఫోన్లు విడుదల చేస్తే మార్కెట్లో అమ్మకాల శాతం పెరుగుతుందని టెక్ నిపుణులు అంటున్నారు. 2021లో 6.3 శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు. 2024 నాటికి స్మార్ట్ ఫోన్ అమ్మకాలు 1.511 బిలియన్ యూనిట్లకు పెరగవచ్చు. 

టాప్ 11 మొబైల్ ఫోన్లు                  ధరలు

యాపిల్ ఐ ఫోన్ల 11 ప్రో మ్యాక్స్         రూ. 109,900

శాంసంగ్ గేలాక్సీ ఎస్ 20 ప్లస్           రూ. 73,999

యాపిల్ ఐ ఫోన్ 11                  రూ. 63,900

గూగుల్ పిక్సెల్ 4                           రూ.78,990

రియల్ మీ ఎక్స్ 50 ప్రొ 5 జీ            రూ 39,999

వివో ఐక్యూ ఓఓ 3                         రూ 34,990

వన్ ప్లస్ 7టీ ప్రొ                        రూ. 48,422

హువాయ్ పీ30 ప్రొ                రూ. 52,990

యాపిల్ ఐ ఫోన్ ఎక్స్ ఆర్               రూ. 47,749

శాంసంగ్ గేలాక్సీ ఎస్ 10ప్లస్           రూ. 68,990

వన్ ప్లస్7టి                             రూ. 34,979

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle