newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వన్‌ప్లస్‌ యూజర్ల డేటా మరోసారి లీక్‌.. ఈ సారి ఏమైందంటే?

24-11-201924-11-2019 17:01:03 IST
2019-11-24T11:31:03.604Z24-11-2019 2019-11-24T11:30:59.919Z - - 17-04-2021

వన్‌ప్లస్‌ యూజర్ల డేటా మరోసారి లీక్‌.. ఈ సారి ఏమైందంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డేటా చోరీ... ఇప్పుడు టెక్‌ ప్రపంచాన్ని భయపెడుతున్న అంశాల్లో కీలకమైనది. ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎలా వస్తున్నారో తెలియకుండా అగతంకులు వెబ్‌సైట్లు, యాప్‌ల్లోకి చేరి వినియోగదారులు డేటాను తస్కరిస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు సైతం వీరి బారినపడ్డారు. తాజాగా వన్‌ప్లస్‌ వినియోగదారులకు అలాంటి ఇబ్బందే ఎదురైంది. తమ వెబ్‌సైట్‌ నుంచి వినియోగదారుల సమాచారం లీకైందని ఆ సంస్థ స్వయంగా ప్రకటించింది.  వేలాదిమంది వన్‌ప్లస్‌ వినియోగదారుల కీలక సమాచారం అగంతుకుల చేతుల్లోకి చేరిందట. 

వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌ నుంచి మొబైల్స్‌ తదితర వస్తువులు కొనుగోలు చేసిన వారి డేటా తస్కరణకు గురైంది. పేరు, కాంటాక్ట్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీ, షిప్పింగ్‌ అడ్రెస్‌ లాంటివి చోరీకి గురయ్యాయి అని వన్‌ప్లస్‌ చెబుతోంది.  అయితే పేమెంట్‌ సమాచారం మాత్రం జాగ్రత్తగానే ఉన్నాయట. అయితే మొత్తం వన్‌ప్లస్‌ వినియోగదారుల సమాచారం చోరీ అవ్వలేదని సంస్థ చెబుతోంది. సమాచారం బయటకు పొక్కిన వారికి వన్‌ప్లస్‌ అధికారికంగా మెయిల్స్‌ కూడా చేస్తోంది. సమాచారం లీకైన వాళ్లకు కచ్చితంగా మెయిల్‌ వస్తుందని, ఒకవేళ మెయిల్‌ రాకపోతే వివరాలు బయటకు వెళ్లనట్టే అని వన్‌ప్లస్ చెబుతోంది.  

డేటా లీక్‌లో బయటకు సమాచారం వెళ్లిన మెయిల్‌ ఐడీలకు స్పామ్‌ మెయిల్స్‌, ఫిషింగ్‌ మెయిల్స్‌ వస్తాయని వన్‌ప్లస్‌ చెప్పింది. కాబట్టి వన్‌ప్లస్‌  వినియోగదారులూ... వెంటనే మీ మెయిల్‌ను చెక్‌ చేసుకోవడం మంచిది. మరోవైపు వన్‌ప్లస్‌ కూడా ఈ విషయంలో విచారణ ప్రారంభించింది. పూర్తి విచారణ చేపట్టిన తర్వాత వాటిని వినియోగదారుల ముందుకు తీసుకొస్తామని వన్‌ప్లస్‌ చెబుతోంది. వన్‌ప్లస్‌ డేటా లీక్‌ అవ్వడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా 40 వేలమంది వన్‌ప్లస్‌ వినియోగదారుల సమాచారం లీకైంది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle