newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

లెనోవో ఫోల్డబుల్ పీసీ.. లుక్ చూశారా?

09-01-202009-01-2020 12:55:39 IST
Updated On 09-01-2020 12:56:41 ISTUpdated On 09-01-20202020-01-09T07:25:39.319Z09-01-2020 2020-01-09T07:25:28.991Z - 2020-01-09T07:26:41.640Z - 09-01-2020

లెనోవో ఫోల్డబుల్ పీసీ.. లుక్ చూశారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కంప్యూటర్ల వినియోగం పెరిగాక పర్సనల్ కంప్యూటర్లు, తర్వాత ల్యాప్ ట్యాప్,పామ్ టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ బాగా పెరిగింది. చైనా కంపెనీలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ ల విక్రయాల్లో తమ సత్తా చాటుతున్నాయి. `లెనోవో` థింక్‌ప్యాడ్ ఎక్స్1 ఫోల్డ్ పేరుతో ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ పీసీని లాంచ్‌ చేసింది. చాలా సింపుల్ గా రిచ్ లుక్ తో ఈ ఫోల్డబుల్ పీసీ అదిరిపోతోంది.

Image

ఈ కంప్యూటర్‌కు మొబైల్ ఫోన్ పోర్టబులిటీ ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇందులో 13.3 ఇంచుల ఫోల్డింగ్ ఓలెడ్ డిస్‌ప్లే వుంది. దీనికి బ్లూటూత్‌ మినీ ఫోల్డ్‌ కీబోర్డ్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఈ కీ బోర్డ్‌ను డిస్‌ప్లే పై భాగంలో లేదా విడిగా కూడా కనెక్ట్‌ చేసుకునే సౌలభ్యం కల్పించింది లెనోవో. మల్టీ టాస్కింగ్‌ కోసం ఈ పీసీని రెండు భిన్నమైన డిస్‌ప్లేలకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఈ పీసీలో యూఎస్‌బీ టైప్‌ సి, ఇంటెల్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ కోర్‌ ప్రాసెసర్‌, విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తదితర ఇతర ఫీచర్లను కూడా అందిస్తోంది.

ఈ పీసీ ధర 2,499 డాలర్లు అంటే మన రూపాయల్లో లక్షా 79 వేలు మాత్రమే. ఈ పీసీని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే నోటు బుక్ తరహాలో తయారవుతుంది. దీని బరువు కూడా ఒక కిలో కంటే తక్కువగా ఉంటుందంటే ఆశ్చర్యపడక తప్పదు.

ఈడివైజ్ ను ఎక్కడికైనా ఈజీగా తీసుకుని వెళ్ళవచ్చంటోంది లెనోవో. ఈ థింక్ ప్యాడ్ గురించిన వార్తలు గత ఏడాది హల్ చల్ చేశాయి. 2020లో కస్టమర్స్ ఎలక్ట్రానిక్‌ షోలో లాంఛ్ చేసి, ఏడాది చివరి నాటికి అన్ని స్టోర్స్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు తాజాగా ప్రకటించింది. మొత్తం మీద లెనోవో థింక్ ప్యాడ్ ఫోల్డబుల్ పీసీ మంచి ఎక్స్ పీరియన్స్ అందిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle