newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లాక్ డౌన్లో వాట్సాప్.. ఇన్‌స్టాగ్రామ్‌ల హవా .. భారీగా డౌన్ లోడ్స్

14-07-202014-07-2020 12:11:11 IST
Updated On 14-07-2020 12:16:33 ISTUpdated On 14-07-20202020-07-14T06:41:11.663Z14-07-2020 2020-07-14T06:40:33.023Z - 2020-07-14T06:46:33.225Z - 14-07-2020

లాక్ డౌన్లో వాట్సాప్.. ఇన్‌స్టాగ్రామ్‌ల హవా .. భారీగా డౌన్ లోడ్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచమంతా కరోనా వైరస్ గుప్పిట్లో కొట్టుమిట్టాడుతోంది. గత మూడునెలలుగా జనం స్టేహోం.. స్టే సేఫ్ అంటున్నారు. దీంతో సోషల్‌ మీడియా వాడకం బాగా పెరిగింది. ఇంట్లో ఉండి కాలక్షేపం కోసం యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌ తెగ వాడేస్తున్నారు. గతంలో తమ అభిప్రాయాలు, భావాలు పంచుకునేందుకు సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించేవారు.

లాక్‌డౌన్‌తో బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో విద్య, విజ్ఞాన తదితర వ్యవహారాలకు వీటిని వినియోగించడం ఎక్కువైంది. దీంతో వాట్సాప్‌ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.  భారత్- చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధంతో యూజర్లు వినోద సాధనంగా ఇన్‌స్టాగ్రామ్‌ను అధికంగా వాడుతున్నారని ఆన్ లైన్ సర్వేలో తేలింది. నెలకు 1.50 కోట్ల మంది పెరుగుతున్నారని తెలుస్తోంది. 

వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల మంది యాక్టివ్‌ యూజర్లుండగా భారత్‌లో 45 కోట్ల మంది యూజర్లున్నారు.  అంటే దేశ జనాభాలో మూడింట ఒకవంతు మంది యూజర్లు వాట్సప్ ని వాడుతున్నట్టు తెలుస్తోంది. వీరి సంఖ్య ప్రతినెల బాగా పెరుగుతోంది. మార్చి, ఏప్రిల్, మేలలో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ యూజర్లు నెలకు 5 కోట్ల మంది చొప్పున పెరిగారంటే ఎంత క్రేజ్ వుందో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో ఏప్రిల్, మే, జూన్‌లలో నెలకు 1.50 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్లు పెరిగారట. 

ఇటు ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు కూడా బాగా పెరిగారని తెలుస్తోంది. ఇటీవల  చైనాకు చెందిన 59 యాప్‌లను కేంద్రం నిషేధించడం ఇన్‌స్టాగ్రామ్‌కు బాగా కలిసొచ్చింది. భారత్‌లో నెలకు దాదాపు 40 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేవారు. ఈ ఏడాది మే నెలలోనే ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్ లోడ్ సంఖ్య 89 లక్షలు పెరగగా, జూన్‌లో 92 లక్షల మంది కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగిస్తున్నారు. గత నెల 29 న టిక్‌టాక్‌ను నిషేధించగానే రంగంలోకి దిగిన ఇన్‌స్టాగ్రామ్‌ 15 సెకన్ల వీడియోలను అప్‌లోడ్‌ చేసే అవకాశం కల్పించింది.

దాంతో టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వైపు యూజర్లు మొగ్గు చూపారని సర్వేలో తేలింది. జూన్‌ 29 నుంచి జూలై 12 నాటికి దాదాపు 50 లక్షల మంది కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద డేటా వినియోగం పెరగడం, సోషల్ మీడియా యాప్ లకు ఆదరణ పెరగడంతో సెల్ ఫోన్ కంపెనీలు ఖుషీ అవుతున్నాయి. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle