రోబో వచ్చి..హోంవర్క్ చేసేస్తే...!
02-03-201902-03-2019 07:53:33 IST
2019-03-02T02:23:33.039Z02-03-2019 2019-03-02T02:23:20.676Z - - 17-04-2021

ఏ దేశంలో చిన్నారులకైనా హోంవర్క్ భారమే. ఆడిపాడే వయసులో వారు పుస్తకాల బరువు మోస్తూ... ఇంటికొచ్చాక కూడా హోంవర్క్ చేస్తూ హైరానా పడతారు. చైనాలో ఓ చిన్నారికి ఓ ఐడియా వచ్చింది. స్కూల్ టీచర్లు ఇచ్చే హోంవర్క్ చేయడానికి ఓ రోబో ఉంటే ఎంత బావుంటుంది అని. హోం వర్క్ చేసే రోబో దొరుకుతుందా.. అని అన్వేషణ చేపట్టింది. ఆ చిన్నారి ప్రయత్నం ఫలించింది. ఓ రోబో దొరికింది.
ఎంచక్కా ఓ రోబోను ఇంటికి తెచ్చుకుంది. అంతవరకూ బాగానే ఉంది. కానీ వాళ్ళమ్మ మాత్రం చిన్నారికి షాకిచ్చింది. స్కూల్‌కు వెళ్లి రాగానే.. హోంవర్క్ అంతా రోబోకి అప్పజెప్పి తను ఎంచక్కా ఆడుకోవచ్చని భావించిన ఆ చిన్నారికి చుక్కెదురైంది. నీ హోం వర్క్ రోబో చేస్తే.. నీవేం చేస్తావ్? నీ చదువు సంగతేంటి? అంటూ చెత్తబుట్టలో పడేసింది. ఇదంతా తెలిసిన టెక్నాలజీ ప్రియులు మాత్రం ఆ చిన్నారిని మెచ్చుకుంటున్నారు.
స్మార్ట్‌గా హోం వర్క్ చేసుకునే పద్ధతిని కనిపెట్టిన ఆ చిన్నారిని శభాష్ అంటున్నారు. ఇంతకీ ఈ రోబో ధర కేవలం మన కరెన్సీలో పదివేల లోపే. పిల్లలు రాయాల్సిన హోంవర్క్ అంతా రోబో పూర్తిచేస్తుంది. పిల్లలు హోంవర్క్ చేసే రోబోలను ఆశ్రయిస్తే.. రేపు వాళ్ళు రాయాల్సిన పరీక్షలకు కూడా రోబోలే కావాలంటారు. అప్పుడు పిల్లల చదువు సంగతేంటని పేరెంట్స్ తెగ మథనపడిపోతున్నారు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా