రెడ్ మీ నుంచి అదిరిపోయే మూడు కొత్త మోడల్స్
03-07-201903-07-2019 16:11:43 IST
Updated On 03-07-2019 17:07:59 ISTUpdated On 03-07-20192019-07-03T10:41:43.647Z03-07-2019 2019-07-03T10:41:37.848Z - 2019-07-03T11:37:59.577Z - 03-07-2019

స్మార్ట్ ఫోన్లు, ఆండ్రాయిడ్ టీవీలు.... స్మార్ట్ వాచ్ లు, బ్యాండ్ లకు కొలువు రెడ్ మీ. అనేక ఫీచర్లు కలిగిన అత్యాధునిక మోడల్ సెల్ ఫోన్లను అతి తక్కువ ధరకు అందిస్తోంది రెడ్ మీ సంస్థ. తాజాగా రెడ్ మీ ఎంఐ సిసి9, ఎంఐ సిసి9ఇ, ఎంఐ సిసి9 మీటు కస్టమ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ట్రిపుల్ రియర్ కెమేరా, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్లలో ఉన్నాయి.

ఈ కొత్త ఫోన్లు ఆపిల్ అనిమోజీ తరహాలో మిమోజీ ఫీచర్ కలిగి ఉన్నాయి. ఎంఐ సిసి9 ఫోన్ కు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కెమేరా ఉండగా, 4030 ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది.
ఎంఐ సిసి9 ఫీచర్లు: ఎంఐ సిసి9 మోడల్ లో 6 జీబీ ర్యాం, 64 జీబీ స్టోరేజీ ఆప్షన్, డార్క్ బ్లూ ప్లానెట్, డార్క్ నైట్ ప్రిన్స్, వైట్ లవర్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఎంఐ సిసి9 ధర చైనా కరెన్సీలో 1799 కాగా, భారతీయ రూపాయి కరెన్సీలో రూ. 18,100. 4 కె వీడియో రికార్డింగ్, హెచ్ డీఆర్, పనోరమా, స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ 960 Fps ఫీచర్లు ఉన్నాయి.
ఎంఐ సిసి9 ఇ ఫీచర్లు:ఎంఐ సిసి9 ఇ మోడల్ లో 4 జీబీ ర్యాం, 64 జీబీ స్టోరేజీ ఆప్షన్ డార్క్ బ్లూ ప్లానెట్, డార్క్ నైట్ ప్రిన్స్, వైట్ లవర్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఈమోడల్ ధర భారతీయ కరెన్సీలో రూ.14వేలు. ఈమెడల్ లోనే 6 జీబీ ర్యాం, 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ మొబైల్ కావాలంటే ధర 16వేలు వరకూ ఉంది. ఈ మోడల్ బ్యాటరీ కూడా 4030 ఎంఎహెచ్ కలిగి ఉంది.
ఎంఐ సిసి9 మీటు కస్టమ్ ఎడిషన్: డార్క్ బ్లూ ప్లానెట్, డార్క్ నైట్ ప్రిన్స్, వైట్ లవర్ కలర్స్ లో దొరికే ఈ మోడల్ స్మార్ట్ ఫోన్లో అనేక ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. 8 జీబీ ర్యాం, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఉన్నాయి. ఈ మోడల్ ధర రూ. 26వేలు జూలై రెండవ వారంలో ఈ మోడల్ ఫోన్లు ఎంఐ స్టోర్లలో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా