newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రెడ్ మి 9i లాంఛ్ ఈరోజే..!

15-09-202015-09-2020 10:45:13 IST
2020-09-15T05:15:13.703Z15-09-2020 2020-09-15T05:15:09.744Z - - 19-04-2021

రెడ్ మి 9i లాంఛ్ ఈరోజే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెడ్ మి 9i ఫోన్ ను ఈరోజు భారత్ లో లాంఛ్ చేయనున్నారు. రెడ్ మి 9 సిరీస్ గత నెలలో భారత్ లో లాంఛ్ చేయగా.. ఇప్పుడు రెడ్ మి 9i ను భారత మార్కెట్ లోకి తీసుకుని వస్తున్నారు. ఇప్పటికే రెడ్ మి 9, రెడ్ మి 9ఏ, రెడ్ మి 9 ప్రైమ్ మోడల్స్ అందుబాటులోకి రాగా త్వరలో రెడ్ మి 9i సందడి చేయనుంది. రెడ్ మి 9i కు సంబంధించిన పూర్తీ వివరాలను Flipkart, Mi.com లలో తీసుకుని రానున్నారు. ఇప్పటికే రెడ్ మి 9i టీజర్ ను వదిలారు. అందులో వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ ఉండనుంది. అలాగే 3.5ఎంఎం జాక్ సపోర్ట్ కూడా రానుంది. ముఖ్యంగా 'బిగ్ ఆన్ ఎంటర్టైన్మెంట్' అనే కాన్సెప్ట్ తో ఈ మొబైల్ ను తీసుకుని రానున్నారు. పెద్ద బ్యాటరీ, డిస్ప్లే విషయంలో కూడా కీలక మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

షియోమీ రెడ్ మి 9i ను మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లాంఛ్ చేయనున్నారు. Mi.com ఎప్పటికప్పుడు రెడ్ మి 9i కు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తోంది. ఈ కొత్త ఫోన్ గురించి తెలుసుకోవాలని అనుకునే వారు ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్ ను పరిశీలించవచ్చు.

రెడ్ మి 9i కు సంబంధించిన టీజర్లలో ఈ ఫోన్ లో మీడియాటెక్ హెలియో ప్రాసెసర్ ఉండనుంది. అలాగే 4జీబీ ర్యామ్ కూడా ఉండనుంది. ఫిజికల్ బటన్స్ స్క్రీన్ కు రైట్ ఎడ్జ్ లో ఉండనున్నాయి. స్టోరేజ్ ను మరింత పెంచుకోడానికి మైక్రో ఎస్.డి. కార్డును కూడా తీసుకుని వచ్చారు. పెద్ద డిస్ప్లే అనుభవం పొందడం కోసం వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ప్లేను తీసుకుని వచ్చారు. బ్యాటరీ సామర్థ్యం కూడా బాగా పెంచనున్నారు. గేమ్స్ ఆడడానికి కూడా బాగా ఉపయోగపడనుంది. MIUI 12 ఓఎస్ ఆధారంగా ఈ మొబైల్ ఫోన్ పని చేయనుంది.      

లీకుల ఆధారంగా రెడ్ మి 9i ప్రారంభ ధర భారత్ లో 7999 రూపాయలు ఉంటుందని భావిస్తూ ఉన్నారు. రెడ్ మి 9ఏ తో పోలిస్తే కొంచెం ధర అధికంగా ఉండనుంది. కానీ బేస్ వేరియంట్స్ అయిన రెడ్ మి 9, రెడ్ మి 9 ప్రైమ్ మోడల్స్ తో పోల్చుకుంటే తక్కువ ధరకే లభించనుంది. రెడ్ మి 9i మోడల్ 4జీబీ ర్యామ్+64జీబీ, 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్స్ లో రానున్నాయి. పలు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది.  

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle