రెడ్మీ కె30 గురించి ఎన్ని వార్తలొస్తున్నాయో!
25-11-201925-11-2019 12:33:02 IST
Updated On 25-11-2019 12:34:35 ISTUpdated On 25-11-20192019-11-25T07:03:02.702Z25-11-2019 2019-11-25T07:02:51.207Z - 2019-11-25T07:04:35.335Z - 25-11-2019

షావోమీ ఫ్లాగ్షిప్ సిరీస్‌లో కొత్త మొబైల్ రావడానికి సర్వం సిద్ధమైపోయింది. ‘రెడ్మీ కె’ సిరీస్‌లో ఇటీవల వచ్చిన ఆదరణ పొందిన ‘రెడ్మీ కె20’ కి కొనసాగింపుగా కొత్త మొబైల్ రాబోతోంది. ‘రెడ్మీ కె30’ గా మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటికొచ్చాయి. ఈ మొబైల్ 5జీ ప్రాసెసర్‌తో రాబోతోందని సమాచారం. దీని కోసం మొబైల్లో మీడియాటెక్ 5జీ ప్రాసెసర్‌ను వాడబోతున్నారట.
రెడ్మీ కె30లో ముందువైపు రెండు కెమెరాలు ఉండబోతున్నాయి. వీటిని పంచ్‌హోల్ డిస్ప్లేలో అందిస్తున్నారు. ఇటీవల వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ప్లస్‌లోనూ ఇలాంటి డిస్ప్లేనే ఉండటం గమనార్హం. ఈ మొబైల్లో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ఉండబోతోంది. ప్రధాన కెమెరా కోసం సోనీ ఐఎంఎక్స్ 686 సెన్సర్‌ను వినియోగించబోతున్నారు. దీంతోపాటు ఈ మొబైల్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండబోతోంది. అంటే వపర్ బటన్ ప్రాంతంలో ఇస్తారన్నమాట.

రెడ్మీ కె30 మొబైల్‌కు ఫోనిక్స్ అనే కోడ్ నేమ్ పెట్టారు. సోనీ ఐఎంఎక్స్ 686 సెన్సర్ కోడ్‌లో ఈ ఫోనిక్స్ పేరు బయటికొచ్చింది. దాని ఆధారంగా రెడ్మీ కె30లో ఆ సెన్సర్ ఉంటుందని నిర్ధరణకు వచ్చారు. అలాగే ఎంఐయూఐ11 కోడ్‌లో ‘హై ఫ్రేమ్ రేట్’ అనే మెథడ్ ఉంది. దాని ఆధారంగా 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉండొచ్చని చెబుతున్నారు. క్వాల్‌కోమ్ కెమెరా లైబ్రరీలో “phoenix_imx686”, “phoenix_s5k3t2”, “phoenix_gc02m1_depth”, “phoenix_gc02m1_front” స్ట్రింగ్స్ను గుర్తించారు. వాటి ఆధారంగా ఇందులో 20 ఎంపీ సెకండరీ కెమెరా ఉంటుందని నిర్ధరణకు వచ్చారు. s5k3t2 స్ట్రింగ్ ఆధారంగా ఈ విషయం తెలిసింది.
రెడ్మీ కె30లో నాలుగు కెమెరాలుంటాయని తెలుస్తోంది. పైన స్ట్రింగ్స్ ప్రకారం మూడు కెమెరాల గురించే తెలుస్తోంది. ఇవి కాకుండా మాక్రో షాట్స్ కోసం మరో కెమెరా ఉండనుందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మొబైల్‌ను వచ్చే నెలలో మార్కెట్లోకి తీసుకొస్తారని తెలుస్తోంది. అయితే మన దేశంలోకి ఎప్పుడు వస్తుందనేది తెలియాల్సి ఉంది.


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా