newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రెడ్‌మి ఫోన్ అమ్మకాల రికార్డు: 90 సెకన్లలో నో స్టాక్‌

18-03-202018-03-2020 17:52:07 IST
2020-03-18T12:22:07.512Z18-03-2020 2020-03-18T12:22:05.045Z - - 14-04-2021

రెడ్‌మి ఫోన్ అమ్మకాల రికార్డు: 90 సెకన్లలో నో స్టాక్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఒకవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ రెడ్‌మి స్మార్ట్ ఫోన్ల హవా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచ ప్రసిద్ధమైన చైనా మొబైల్ పోన్ తయారీ సంస్థ షియోమి తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసిన రెడ్‌మి నోట్‌ 9 ప్రో స్మార్ట్‌ఫోన్లు 90 సెకన్లలోనే అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. గత వారమే ఈ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 

సోమవారం అమెజాన్ ఇండియాలో నిర్వహించిన ఫస్ట్‌సేల్‌లో రెడ్‌మి తాజా ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ తాజా ఫోన్లలోని స్నాప్‌డ్రాగన్ 720జి ఎస్ఓసీ, 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అదనపు ఆకర్షణలు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

అమెజాన్‌తో పాటు ఎంఐ డాట్‌కామ్, ఎంఐ హోం, ఎం స్టూడియో స్టోర్లలోనూ ఈ ఫోన్ సోమవారం కొనుగోళ్ల సునామీ సృష్టించింది. దీంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి‌. మరోసేల్‌ను ఈ నెల 24న నిర్వహించనున్నట్టు షియోమీ ఇండియా చీఫ్ మనుకుమార్ జైన్ తెలిపారు. 

అమెజాన్‌లో ఈ ఫోన్లు విక్రయానికి పెట్టిన 90 సెకన్లలోనే అమ్ముడుపోయినట్టు మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.12,999 కాగా, 6జీబీ,128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.15,999గా నిర్ణయించారు. 

లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ.1000 డిస్కౌంట్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ రూ.298, రూ.398  అన్‌లిమిటెడ్ ప్యాక్‌లపై డబుల్ డేటా వంటి ప్రయోజనాలను సైతం అందిస్తోంది. 

రెడ్‌మి నోట్ 9 ప్రొ ఫీచర్లు...

  • 6.67 అంగుళాల ఫుల్ హెడ్‌డీ ప్లస్ ఐపీఎస్‌ డిస్‌ప్లే
  • 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనక నాలుగు కెమెరాలు
  • ఫ్రంట్‌ 16 మెగాపిక్సెల్ కెమెరా
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
  • 512 జీబీ వరకు మెమొరీని పెంచుకునే అవకాశం
  • 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.  

అయితే 90 సెకన్లలోనే రికార్డు అమ్మకాలు జరిపామంటూ ఘనంగా చెప్పుకున్న షియోమీ ఆ 90 సెకన్లలో ఎన్ని మొబైల్ల్ అమ్ముడయ్యాయన్నది మాత్రం వెల్లడించలేదు. సంస్థ ఒరిజినల్ వెబ్ సైట్ అయిన  Mi.com లోనూ, ఇతర చానల్స్ లోనూ స్టాక్ ఒకటన్నర నిమిషం లోపే అయిపోయిందని చెబుతున్నారు తప్పితే ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయని తెలపకపోవడం మరుసటి ఆన్ లైన్ సేల్‌కు డిమాండును సృష్టించే మార్కెట్ ఎత్తుగడల్లో భాగమే అంటున్నారు. 

ఈ తాజా ఫోన్ Amazon, Mi.com, Mi Home తదితర రిటైల్ స్టోర్లలోనూ త్వరలో అందుబాటులోకి రానుంది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle