రెండు కొత్త ఫీచర్స్... యూజర్లు ఫేస్‘బుక్’
20-12-201820-12-2018 19:08:27 IST
2018-12-20T13:38:27.798Z20-12-2018 2018-12-20T13:38:25.800Z - - 17-04-2021

కొన్నాళ్ళ నుంచి సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్బుక్’కి కొంచెం ఆదరణ తగ్గింది. ఇందుకు కారణం... ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లే! ఈ రెండింటి పట్ల వినియోగదార్లను ఆకర్షించేందుకు కొత్త ఫీచర్లను డెవలప్ చేసే పనిలో సంస్థ నిమగ్నమైపోయింది. ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాక ఈ రెండింటిలో యూజర్ల సంఖ్య పెరిగింది. మరోవైపు ఫేస్బుక్లో అలాంటి ఫీచర్స్ లేని కారణంగా యూజర్ల యాక్టివిటీ కొంతమేర తగ్గింది. ఈ విషయాన్ని పసిగట్టిన సంస్థ... తిరిగి యూజర్స్‌ని ఆకర్షించేందుకు ఫేస్‌బుక్‌పై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రెండు కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. అవే సెల్ఫీ పోట్రెట్ షాట్, బూమరాంగ్! ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఈ రెండు ఫీచర్స్‌కి వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు ఫేస్‌బుక్‌కి యాడ్ చేస్తే... పోయిన యూజర్స్ తిరిగి వస్తారని సంస్థ ఆశిస్తోంది.
సెల్ఫీ పోట్రెట్ షాట్ : ఈ ఫీచర్ ద్వారా ఫోటోలు క్యాప్చర్ చేసినప్పుడు... కేవలం మనిషి మాత్రమే హైలైట్ అయ్యి, బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఆటోమెటిక్‌గా బ్లర్ అవుతుంది. ఫలితంగా ఫోటో చాలా క్లారిటీగా వస్తుంది. ఒకవేళ దీనికి మనకు నచ్చిన స్టిక్కర్స్ అంటించుకోవాలంటే... ఆ సదుపాయమూ ఫేస్బుక్ మెస్సేంజర్లో ఉంది.
బూమరాంగ్ : ఈ ఫీచర్ ద్వారా రికార్డు చేయబడిన వీడియో GIFగా మారుతుంది. ఈ కొత్త ఫీచర్‌తో ఫేస్బుక్ మెస్సేంజర్లో 5 వేర్వేరు కెమెరా మోడ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆదరణ పొందిన ఈ ఫీచర్ ఫేస్‌బుక్‌లోనూ తన మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా