newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రూ.99కే నోకియా స్మార్ట్‌ఫోన్‌

17-10-201817-10-2018 17:36:36 IST
Updated On 17-10-2018 17:36:36 ISTUpdated On 17-10-20182018-10-17T12:06:36.962Z17-10-2018 2018-10-17T12:06:36.962Z - 2018-10-17T12:06:36.965Z - 17-10-2018

రూ.99కే నోకియా స్మార్ట్‌ఫోన్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వ్యాట్సాప్‌లలో చక్కర్లు కొట్టే అబద్ధపు వార్తల్లాలాగా ఇదే ఫేక్ న్యూస్ కాదు... నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ నిజంగా ప్రకటించిన బంపరాఫర్! కేవలం రూ.99 డౌన్‌పేమంట్‌తోనే ఎంపిక చేసిన నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయవచ్చని ఆ సంస్థ వెల్లడించింది. అదికూడా ‘నో-కాస్ట్‌’ ఈఎంఐ ఆప్షన్‌లో నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లించవచ్చని పేర్కొంది. నవంబర్ 10వ తేదీ వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు ఉన్నవాళ్ళు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా పొందవచ్చు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ నోకియా 8 సిరాకోపై 15 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. అయితే... ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కార్పొరేట్‌, బిజినెస్‌, కమర్షియల్‌ క్రెడిట్‌ కార్డులకు వర్తించదు. నోకియా 1, నోకియా 2.1, నోకియా 5.1, నోకియా 6.1, నోకియా 3.1 ప్లస్, నోకియా 8 సిరాకో. నోకియా 3.1ప్లస్‌ తదితర ఫోన్లను నోకాస్ట్‌ ఈఎంఐలో రూ.99కే సొంతం చేసుకోవచ్చు. రిలయన్స్‌ జియో, జియో డిజిటల్‌ లైఫ్, క్రోమా స్టోర్‌లలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఈ ఆఫర్‌ని పొందవచ్చు. అంతేకాదు... అధికారిక నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో కూడా ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

ఒకప్పుడు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన నోకియా... ఆ తర్వాత వేరే మొబైల్ కంపెనీల ప్రభావంతో దుకాణం బంద్ చేసుకోవాల్సి వచ్చింది. తిరిగి మార్కెట్‌లో పూర్వవైభవం పొందేందుకు ఆండ్రాయిడ్‌తో చేతులు కలిపి... ప్రస్తుత మార్కెట్ ధరలకే మంచి ఫీచర్లతో హెచ్‌ఎండీ గ్లోబర్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. కానీ... అనుకున్నంత స్థాయిలో ఈ ఫోన్లు మార్కెట్‌లో అమ్ముడుపోవడం లేదు. దీంతో గతిలేక... ఇలా ఆఫర్ల బాట పట్టినట్లు తెలుస్తోంది. మరి... ఈ ఆఫర్‌తోనైనా నోకియా సేల్స్ పుంజుకుంటాయో లేదో వేచి చూడాలి.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle