రిలయన్స్ జియో సెన్సేషన్.. జియో మీట్
01-05-202001-05-2020 19:25:57 IST
Updated On 01-05-2020 19:34:22 ISTUpdated On 01-05-20202020-05-01T13:55:57.223Z01-05-2020 2020-05-01T13:55:27.705Z - 2020-05-01T14:04:22.777Z - 01-05-2020

టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కంపెనీలు అత్యాధునిక యాప్ లు విడుదల చేస్తున్నాయి. టెలికాం రంగంలో సంచలనం కలిగించిన రిలయెన్స్ జియో కొత్త యాప్ తెచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్డౌన్ పరిస్థితులను సరిగ్గా క్యాష్ చేసుకుంటున్నాయి గూగుల్, ఫేస్ బుక్. తాజాగా ఈ జాబితాలో చేరింది జియో. కొత్త వీడియో కాన్ఫరెన్స్ యాప్ ని ప్రారంభించింది. రిలయన్స్ జియో తన ప్లాట్ ఫాం మీద జియో మీట్ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను లాంచ్ చేసింది. తద్వారా ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో అత్యవసరంగా మారిన వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవలలోకి ప్రవేశించింది. ఈ రంగంలో ఇప్పటికే దూసుకుపోతున్న జూమ్, గూగుల్ మీట్, ఫేస్ బుక్, హౌస్‌పార్టీ లాంటి యాప్ లకు గట్టి షాక్ ఇచ్చింది. జియో మీట్ చాలా ప్రత్యేకతను కలిగి ఉందని,ఇది ఏ పరికరంలోనైనా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లోనైనా పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సీనియర్ విపి పంకజ్ పవార్ ఈమేరకు వెల్లడించారు. జియోమీట్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా ఏ యాప్‌లో అయినా యాక్సెస్ చేయొచ్చు. ఇది కూడా చదవండి.. జూమ్ యాప్.. గూగుల్ మీట్.. ఫేస్ బుక్ మెసెంజర్ ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్ మార్కెట్‌ప్లేస్ నుంచి, మ్యాక్ యాప్ స్టోర్ నుంచి జియోమీట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.వీడియో కాన్ఫరెన్సింగ్‌కు మాత్రమే జియో మీట్ పరిమితం కాదు. జియో ఇహెల్త్, ఇఎడ్యుకేషన్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లతో దీన్ని అనుసంధించారు. దీని ద్వారా వినియోగదారులు వర్చ్యువల్ గా వైద్యులను సంప్రదించడానికి, ప్రిస్క్రిప్షన్లను పొందడానికి మందులు తీసుకోవడానికి పనికొస్తుంది. వర్క్ ఫ్రం హోం లో వున్న ఉద్యోగులను సంప్రదించేందుకు వర్చువల్ తరగతి గదులు, రికార్డ్ సెషన్లు, హోంవర్క్‌లు, పరీక్షలను నిర్వహించడం లాంటి వాటికోసం ఇ-ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం సహాయపడుతుంది.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
20 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా