newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రిలయన్స్‌ జియోలో 150 లైవ్‌ ఛానళ్లు.. ఎలా ఉంటాయో!

10-11-201910-11-2019 23:50:52 IST
2019-11-10T18:20:52.845Z10-11-2019 2019-11-10T18:20:47.246Z - - 17-04-2021

రిలయన్స్‌ జియోలో 150 లైవ్‌ ఛానళ్లు.. ఎలా ఉంటాయో!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రిలయన్స్‌ జియో ఫైబర్‌ ప్లాన్స్‌ ఇవీ.. అంటూ రెండు నెలల క్రితం జియో కొన్ని వివరాలు తెలిపింది. ఆ తర్వాత ఎప్పుడు అధికారికంగా అందుబాటులోకి తెస్తారనే విషయంలో ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రేపు మాపు అంటూ కొన్ని వార్తలు వస్తున్నా వాటి మీద ఎక్కడా స్పష్టత లేదు. తాజాగా కొన్ని వివరాలు బయటికొచ్చాయి. జియోఫైబర్‌లో భాగంగా 4కే సెట్‌ టాప్‌ బాక్స్‌ ఇస్తామని గతంలోనే చెప్పారు. ఇప్పుడు దీంతోపాటు ట్రిపుల్‌ ప్లే బ్రాడ్‌బ్యాండ్‌ ఆఫర్లను తీసుకొస్తారు. జియో ఫైబర్‌ ట్రయిల్‌ రన్‌ పూర్తయిందనేది తాజా కబురు. అంటే త్వరలోనే పూర్తిస్థాయిలో సర్వీసులు మొదలవుతాయి.

జియో ఫైబర్‌ ఆఫర్లు ₹699తో మొదలవుతాయని జియో ఇదివరకే ప్రకటించింది. అయితే అప్పుడు సెట్‌టాప్‌ బాక్స్‌, కేబుల్‌ టీవీల సంగతి చెప్పలేదు. అయితే జియో ఫైబర్‌ వాడుతున్న యూజర్లు కొత్తగా మళ్లీ జియో కేబుల్‌ కనెక్షన్‌ తీసుకోవాలని ఉంటుందని ఆ సమయంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదని తెలుస్తోంది. కేబుల్‌ టీవీ కనెక్షన్‌ లేకుండానే 150 వరకు లైవ్‌ టీవీ ఛానళ్లను వీక్షించొచ్చని తాజా సమాచారం. ఇంటర్నెట్‌ ఐపీటీవీ సర్వీసు ఆధారంగా లైవ్‌ టీవీ సర్వీసులు అందిస్తారని తెలుస్తోంది. తొలి రోజుల్లో ఈ సంఖ్య మరింత పరిమితంగా ఉండే అవకాశమూ ఉంది.

జియో తాజా ఆలోచనల విషయంలో వినియోగదారులు అంత సంతృప్తిగా లేరని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ట్రెడిషనల్‌ ఛానళ్లకు ఇవ్వకుండా ఇలా లైవ్‌ ఛానళ్లు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదనేది యూజర్ల మాట. ఐపీటీవీ ద్వారా పని చేయడం వల్ల జియో బ్రాడ్‌బ్యాండ్‌ డేటా త్వరగా ఖర్చయిపోతుంది. యూజర్ల అసంతృప్తికి కారణమిదే. దీంతోపాటు జియో సెట్‌టాప్‌బాక్స్‌లో జియో టీవీ యాప్‌ కూడా ఉండదు. కాబట్టి జియో టీవీ యాప్‌లో అందుబాటులో ఉన్న 650 ఛానళ్లను జియో ఫైబర్‌తో చూసే పరిస్థితి లేదు. అయితే జియో ఫైబర్‌లో జియో టీవీ ప్లస్‌ అనే యాప్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. షావోమీ టీవీల్లో ఉండే ప్యాచ్‌వాల్‌, వన్‌ప్లస్‌ టీవీల్లో ఉండే ఆక్సిజన్‌ ప్లే తరహాలో జియో టీవీప్లస్‌ఉండబోతోందని సమాచారం.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle