newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

రియల్ మీ నుంచి సీ11 సిరీస్ బడ్జెట్ ఫోన్

09-07-202009-07-2020 13:32:32 IST
2020-07-09T08:02:32.441Z09-07-2020 2020-07-09T08:02:20.297Z - - 04-08-2020

రియల్ మీ నుంచి సీ11 సిరీస్ బడ్జెట్ ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రియల్ మీ సంస్థ అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను విడుదలచేస్తూనే వుంది. అయితే ఈసారి మాత్రం బడ్జెట్ ఫోన్ వైపు అడుగులు వేసింది.  రియల్ మీ త్వరలో తన బడ్జెట్ ఫోన్ సీ11ని మనదేశంలో లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే మలేషియాలో విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ పేరును రియల్ మీ ప్రకటించలేదు. రియల్ మీ సీ-సిరీస్ ఫోన్లలో మరో కొత్త ఫోన్ రానుందని మాత్రమే తెలిపింది. దీనిపై రియల్ మీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఈ స్మార్ట్ ఫోన్ మొదట మలేషియాలో లాంచ్ అయింది. దీని ధరను ఇక్కడ 429 మలేషియా రింగెట్లుగా అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.7,600గా నిర్ణయించారు. అక్కడ 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. మింట్ గ్రీన్, పెప్పర్ గ్రే రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

రియల్ మీ సీ 11 స్పెసిఫికేషన్స్

* 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే

* యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 

* మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్

*వెనకవైపు రెండు కెమెరాలు

*13 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్  రెండు కెమెరాలు

*సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరా

* బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్

* 32 జీబీ స్టోరేజ్ 

* 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్

* మైక్రో యూఎస్ బీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ 

*  బరువు 196 గ్రాములు

* మింట్ గ్రీన్, పెప్పర్ గ్రే కలర్స్ 

*ధర రూ.7600 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle