newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రియల్‌మీ సీఈవో ఐఫోన్‌ వాడుతున్నాడు!

19-11-201919-11-2019 15:09:13 IST
Updated On 19-11-2019 16:05:48 ISTUpdated On 19-11-20192019-11-19T09:39:13.384Z19-11-2019 2019-11-19T09:35:03.762Z - 2019-11-19T10:35:48.864Z - 19-11-2019

రియల్‌మీ సీఈవో ఐఫోన్‌ వాడుతున్నాడు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐఫోన్‌ వాడాలని ఎవరికి ఉండదు చెప్పండి... చూడటానికి ముచ్చటగా, కాస్త దర్పాన్ని ప్రదర్శించేలా సూపర్‌గా ఉంటుంది. కానీ ఓ మొబైల్‌ కంపెనీ సీఈవో వాడితే అంత బాగుండదు కదా. మా ఫోన్‌నే వాడండి... అద్భుతంగా ఉంటుంది అని చెప్పే ఓ సంస్థ సీఈవో మరో కంపెనీ ఫోన్‌ను వాడితే ‘అస్సలు బాగోదు’. గతంలో హువావే లాంటి సంస్థలు ఇలా తమ ఉద్యోగులు వేరే ఫోన్‌ వాడారని ఉద్యోగం నుంచి తొలగించిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పనే చేశాడు రియల్‌మీ సంస్థ ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌. 

రియల్‌మీ తన పాత ఫోన్లకు ఇటీవల కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రోల్‌అవుట్‌ చేస్తోంది. ఈ క్రమంలో రియల్‌మీ 3, రియల్‌మీ 3ఐకి అప్‌డేట్‌ రిలీజ్‌ చేశామని మాధవ్‌ సేథ్‌ ట్వీట్‌ చేశాడు. అక్కడివరకు బాగానే ఉంది కానీ ఆ ట్వీట్‌లో ఓ ఆసక్తికర అంశాన్ని నెటిజన్లు గుర్తించారు. మాధవ్‌ సేథ్‌ ఆ ట్వీట్‌ను ఐఫోన్‌ నుంచి చేశాడు. ట్వీట్‌ కింద ‘ట్వీట్‌ ఫ్రమ్‌ ఐఫోన్‌’ అనే బ్యాడ్జ్‌ పడింది. దీంతో నెటిజన్ల తమ కామెంట్లకు పని చెప్పారు. దీనిని గుర్తించిన మాధవ్‌ సేథ్‌ ఆ ట్వీట్‌ను తొలగించారు. కానీ అప్పటికే స్క్రీన్‌ షాట్లు తీసిన వాళ్లు దాన్ని ఆన్‌లైన్‌లో సర్క్యులేట్‌ చేస్తున్నారు. అయితే ఆ ట్వీట్‌ మాధవ్‌ సేథ్‌ చేయకపోయుండొచ్చని, ఆయన సోషల్‌ మీడియా టీమ్‌ చేసుండొచ్చని అంటున్నారు. అయితే ఎవరు చేసినా రియల్‌మీ ఉద్యోగి చేసినట్లే కదా. 

ఈ ట్వీట్‌ ట్రెండింగ్‌లో ఉన్న సమయంలోనే మాధవ్‌ సేథ్‌ మరో ట్వీట్‌ చేశాడు. అందులో అన్ని కంపెనీల ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు కనిపించాయి. ‘‘గత కొద్ది రోజులుగా అన్ని ప్రముఖ ఫ్లాగ్‌షిప్‌ మొబైళ్లను వాడుతున్నాను. మా నుంచి త్వరలో రాబోతున్న రియల్‌మీ ఎక్స్‌2ప్రో అన్ని ఫ్లాగ్‌షిప్‌ల కంటే అదిరిపోతుంది’’ అనే అర్థం వచ్చేలా రాసుకొచ్చాడు. అయితే మాధవ్‌ సేథ్‌ ఆ ట్వీట్‌ ఎందుకు డిలీట్‌ చేశారనేది ఇప్పుడు నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న. మరి నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఎప్పుడూ ట్వీట్లతో సమాధానాలిచ్చే మాధవ్‌ సేథ్‌ ఈ ‘ఐఫోన్‌’ ప్రశ్నకు కూడా సమాధానమిస్తాడేమో చూడాలి. 

https://www.photojoiner.net/image/hFRfFtXQ

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle