రియల్మీ తొలిసారి అధిక ధరలో...
22-11-201922-11-2019 15:19:31 IST
2019-11-22T09:49:31.152Z22-11-2019 2019-11-22T09:49:25.968Z - - 10-04-2021

బడ్జెట్ మొబైల్స్ బ్రాకెట్లో దూసుకుపోతున్నరియల్మీ తొలిసారి ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఓ మొబైల్ తీసుకొచ్చింది. అయితే ఇది అందుబాటు ధరలోనే అనుకోండి. చాలా రోజుల నుంచి తీసుకొస్తాం అంటూ ఊరిస్తూ వచ్చిన ఫ్లాగ్షిప్ డివైజ్ ‘ఎక్స్2 ప్రో’ను రియల్మీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో రీసెంట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్‌ను ఇస్తున్నారు. ఈ నెల 26 నుంచి రియల్మీ ఎక్స్2 ప్రో సేల్‌కి తీసుకొస్తున్నారు. అయితే ఇది ఇన్వైట్స్ తరహాలో సాగుతుంది. అంటే ఫ్లిప్‌కార్ట్‌లో లాగిన్ అయితే మీకో కోడ్ వస్తుంది. దానితో 26 నుంచి మొబైల్ కొనుగోలు చేయొచ్చు. చాలా రోజుల క్రితం షావోమీ ఇలాంటి విధానాన్నే అనుసరించేది. ఎక్స్2ప్రో ఫీచర్లు ఇవీ... రియల్మీ ఎక్స్2 ప్రో ఆండ్రాయిడ్ 9.0 ‘పై’ తో పని చేస్తుంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఫ్లూయిడ్ డిస్ప్లే ఇస్తున్నారు. ఈ మొబైల్లో 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వెర్షన్లలో మొబైల్‌ను తీసుకొచ్చారు. వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉంటాయి. 64 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ఇస్తున్నారు. దీంతోపాటు 13ఎంపీ టెలీఫొటో లెన్స్, 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో లెన్స్ అమర్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 16 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 471 సెన్సర్ అందిస్తున్నారు. మొబైల్లో 4000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. ఇది 50వాట్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 35 నిమిషాల్లో బ్యాటరీని 100 శాతం ఛార్జ్ అవుతంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ ధర రూ. 29,999. 12 జీబీ ర్యామ్, 256 జీబీ మోడల్ ధర రూ. 33,999. దీంతోపాటు మాస్టర్ ఎడిషన్ అంటూ మరో మోడల్‌ను కూడా తీసుకొచ్చారు. దీనిని డిసెంబరు 25 నుంచి సేల్‌కి తీసుకొస్తారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమొరీతో ఈ మొబైల్‌ను తీసుకొస్తున్నారు.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
3 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా