newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రియల్‌మి X2లో సెల్ఫీలు మరింత అందంగా....

19-09-201919-09-2019 11:25:24 IST
2019-09-19T05:55:24.655Z19-09-2019 2019-09-19T05:55:19.756Z - - 12-04-2021

రియల్‌మి X2లో సెల్ఫీలు మరింత అందంగా....
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్‌ కంపెనీలు ఎక్కువ శాతం ‘చైనా టు ఇండియా’ పాలసీని అనుసరిస్తుంటే... ‘రియల్‌మి’ మాత్రం ‘ఇండియా టు చైనా’ పాలసీ ఫాలో అవుతున్నట్లుగా ఉంది. ఇక్కడ విడుదలైన ‘రియల్‌మి 5 ప్రో’ని ‘రియల్‌మి Q’గా చైనాకి తీసుకెళ్లి బొక్కబోర్లా పడింది. ఒప్పొ మొబైళ్లను ఆదరించే చైనీయులు.. అదే సంస్థకు చెందిన రియల్‌మి మొబైళ్లను ఆదరించలేదు. అయితే రియల్‌మి ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేయబోతోంది. మొన్నామధ్య మనదేశంలో విడుదలైన ‘రియల్‌మిXT’కి చిన్నపాటి మార్పులు చేసి మళ్లీ చైనా తీసుకెళ్తోంది. మరి ఈ మొబైల్‌ రియల్‌మి కి ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తుందో చూడాలి. 

ఎక్స్‌2కు సంబంధించిన స్పెసిఫికేషన్లను టీజ్‌ చేస్తూ రియల్‌మి చైనాలో కొన్ని పోస్టర్లను విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా వెనుకవైపు 64 ఎంపీ కెమెరా, ముందువైపు 32 ఎంపీ కెమెరాను హైలైట్‌ చేశారు. మిగిలిన స్పెసిఫికేషన్ల గురించి వివరించనప్పటికీ అవన్నీ రియల్‌మి ఎక్స్‌టీ స్పెసిఫికేషన్లను పోలి ఉంటాయని తెలుస్తోంది. అయితే రియల్‌మి ఎక్స్‌2 స్నాప్‌డ్రాగన్‌ 730జి ప్రాసెసర్‌ మీద పని చేస్తుంది. ఇది గేమింగ్‌ కోసం స్నాప్‌డ్రాగన్‌ ప్రత్యేకంగా రూపొందించిన ప్రాసెసర్‌. దీంతోపాటు ఈ మొబైల్‌లో 30 వాట్‌ వూక్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌ సపోర్టు కూడా ఉంది. 

రియల్‌మి ఎక్స్‌2 ఈ నెల 24న చైనాలో విడుదల చేస్తున్నారు. ఆ రోజు ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి స్పెషిఫికేషన్ల గురించి తెలుస్తుంది. మరోవైపు ఈ మొబైల్‌లో ఇదే పేరుతోగానీ, లేదా మరో పేరుతోగానీ భారత్‌లోనూ విడుదల చేయొచ్చని తెలుస్తోంది. కొందరైతే రియల్‌మి ఎక్స్‌టీ ప్రోగా తీసుకొస్తారు అని చెబుతున్నారు. కానీ రియల్‌మి దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. రియల్‌మి Qతో చైనాలో రియల్‌మికి పెద్దగా లాభించలేదు. మరి ఈ మొబైల్‌ అయినా చైనా మార్కెట్‌లో రియల్‌మికి స్థానం కల్పిస్తుందా అనేది చూడాలి. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle