రియల్‌మి ఫోన్లలో ‘ఆండ్రాయిడ్ 10’ విడుదల తేదీలివిగో...
14-09-201914-09-2019 08:03:37 IST
2019-09-14T02:33:37.411Z14-09-2019 2019-09-14T01:58:06.898Z - - 12-04-2021

యూజర్లకు ఎప్పటికప్పుడు తక్కువ ధరలో మొబైల్స్ అందిస్తోంది రియల్‌మి. లోబడ్జెట్‌లో మొబైళ్లు కొనాలని చూసేవారికి ఆసక్తికరమైన ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను అందిస్తోంది. అందుకుతగ్గట్టే సాఫ్ట్వేర్ అప్డేట్లు ఇస్తూ వస్తోంది. అందుకే బడ్జెట్ వినియోగదారులు రియల్‌మి ఫోన్లు అంటే మోజు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టే నెలకో మొబైల్‌ను తీసుకొస్తోంది రియల్ మి. నిన్ననే రియల్‌మి XT స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది కూడా. ఇప్పుడు తమ మొబైల్స్‌కు కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడు వస్తుందనే విషయాన్నికూడా స్పష్టం చేసింది.
రియల్‌మి మొబైళ్లలో అధిక శాతం వినియోగంలో ఉన్న స్మార్టఫోన్లకు వచ్చే ఏడాది 'తొలి క్వార్టర్' నుంచే ఆండ్రాయిడ్ 10 రిలీజ్ మొదలవుతుంది. రియల్ మి 3 ప్రో, రియల్ మి 5 ప్రో, రియల్ మి X, రియల్‌మి XT మొబైళ్లకు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఆండ్రాయిడ్ 10 వస్తుంది. ఇక 'రెండో క్వార్టర్లో' రియల్‌మి 3, రియల్‌మి 5, రియల్‌మి 3i స్మార్ట్ఫోన్లకు కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్ అందుబాటులోకి వస్తుంది. రియల్‌మి రెండో తరం మొబైల్ రియల్‌మి 2 pro కు మాత్రం 'మూడో క్వార్టర్లో' ఆండ్రాయిడ్ 10 వస్తుంది. రియల్‌మి 2, రియల్‌మి 1కి ఆండ్రాయిడ్ 10 రానట్లే. ఇకపై వచ్చే కొత్త రియల్‌మి సిరీస్‌లు డైరెక్ట్‌గా ఆండ్రాయిడ్ 10తోనే వస్తాయని తెలుస్తోంది.
ఆండ్రాయిడ్ తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇటీవల లాంచ్ చేసింది. ఈసారి కొత్తగా వెర్షన్ ఆండ్రాయిడ్ 10 అనే పేరు పెట్టింది. మామూలుగా అయితే సిరీస్‌లో భాగంగా Q తో మొదలయ్యేలా ఏదో ఆహార పదార్థం పేరు పెట్టాలి. కానీ ఈసారి ఆ పని చేయలేదు. యూజర్ల సౌలభ్యం కోసం ఈ మార్పు చేసినట్లు చెప్పింది. అయితే Qతో పేరును త్వరలో ప్రకటిస్తుందని వార్తలొస్తున్నాయి. దీనిపై గూగుల్ నుంచి ఎవరూ స్పందించడం లేదు.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా