newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రింగ్ టోన్ త్వరగా ఆగిపోతోందా.. మొదలైనట్లే

04-10-201904-10-2019 12:55:26 IST
2019-10-04T07:25:26.992Z04-10-2019 2019-10-04T07:25:21.966Z - - 14-04-2021

రింగ్ టోన్ త్వరగా ఆగిపోతోందా.. మొదలైనట్లే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెలికాం కంపెనీలు మొబైల్ కాల్ రింగ్ సమయాన్ని తగ్గించాయి. ఇంతకు ముందు రింగింగ్ సమయం 45 సెకండ్లు ఉండేది. దాన్ని 25 సెకన్లకు తగ్గించారు. తాజాగా ఇదే విషయాన్నీ టెలికాం రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి ఎయిర్ టెల్ వెల్లడించింది. ఎయిర్‌టెల్ నుంచి జియో, వొడాఫోన్ ఐడియాకు వెళ్లే అవుట్ గోయింగ్ కాల్స్ రింగ్ వ్యవధిని 25 సెకన్లకు తగ్గించినట్టు భారతీ ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. వొడాఫోన్ ఐడియా కూడా రింగ్ వ్యవధిని తగ్గించినట్టు తెలిసింది. 

జియో తన రింగ్ టైంను 20 సెకన్లకే పరిమితం చేసిందని, అయితే, ఈ వారం మొదట్లో కొన్ని సర్కిళ్లలో రింగ్ టైంను 25 సెకన్లకు పెంచిందని ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు ఆరోపిస్తున్నాయి. 

రింగ్ వ్యవధిని తక్కువ చేయడం ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీయాలనే వ్యూహం ఇందులో కనిపిస్తోందన్నది వీటి వాదన. రింగ్‌ టైంను తగ్గించడం ద్వారా 25 సెకన్ల తర్వాత ఫోన్ ఆగిపోతుంది. ఫలితంగా అవతలి వ్యక్తి ఫోన్‌పై మిస్డ్ కాల్ పడుతుంది. దీంతో కాల్ బ్యాక్ వస్తుందని, దీనిని సొమ్ము చేసుకోవాలనే వ్యూహం ఇందులో దాగుందని ఆరోపిస్తున్నాయి. ఇది ఐయూసీని (ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఫీ) మానిప్యులేట్ చేయడమే అవుతుందని పేర్కొన్నాయి.

ఐయూసీ విషయంలో రిలయన్స్ జియో-భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య జరుగుతున్న యుద్ధం తాజాగా మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు అవుట్ గోయింగ్ కాల్స్ రింగ్ టైం వ్యవధిని 40 సెకన్ల నుంచి 25 సెకన్లకు తగ్గించాయి. ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్ మొత్తంలో రింగ్ వ్యవధిని తగ్గించగా, వొడాఫోన్ కొన్ని సర్కిళ్లలో మాత్రమే రింగ్ టైంను తగ్గించింది. 

ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీ (ఐ యు సి ) నష్టాన్ని తగ్గించుకోవడానికి తాము కూడా రింగింగ్ సమయాన్ని తగ్గించక తప్పలేదని ఎయిర్ టెల్ అంటోంది. జియో పేరు వెల్లడించకుండా గత వారంలో ఎయిర్ టెల్ ఆరోపణలు చేసింది. అవుట్ గోయింగ్ కాల్ రింగింగ్ సమయాన్ని తగ్గించి ఇంటర్ కనెక్ట్ యూసేజ్ వ్యవస్థతో ఆడుకుంటున్నట్టు పేర్కొంది. జియో ఏమంటోందంటే...కొన్ని టెలికామ్ కంపెనీలు తమ తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఐ యూ సి పేరుతో నిందిస్తున్నట్టు కంపెనీ అధికారి ఒకరు అంటున్నారు. 

ఏది ఏమైనా.. మార్కెట్‌ను క్యాష్ చేసుకునే విషయంలో రిలయన్స్‌తో పోటీపడే సంస్థలు ఏపీ లేవని మరోసారి రుజువయింది. రిలయన్స్ ఏదైనా ఒక బాట పరిస్తే ఆ దారంటానే ఇతర సంస్థలు పయనించక తప్పని పరిస్థితి పదే పదే నెలకొంటూండటం విశేషం.

Image result for Why your outgoing calls are ringing only for 25 seconds before getting cut

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle