newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రష్యన్ గణిత మేధావిపై గూగుల్ డూడుల్

07-03-201907-03-2019 12:36:56 IST
2019-03-07T07:06:56.889Z07-03-2019 2019-03-07T07:06:48.129Z - - 11-04-2021

రష్యన్ గణిత మేధావిపై గూగుల్ డూడుల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇవాళ రష్యన్ గణిత మేధావి ఓల్గా లేడీజెహెంసాకయాకి గూగుల్ డూడుల్ రూపంలో నివాళి అర్పించింది. ఓల్గా లేడీజెహెంసాకయా రష్యాలోని కోలగ్రి‌వ్‌లో 7 మార్చి 1922 జన్మించింది. ఇవాళ ఆమె 97వ జయంతి. దీనిని పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. ఆమె 12  2004లో సెయింట్ పీటర్స్ బర్గ్, రష్యాలో తుదిశ్వాస విడిచింది. గణిత శాస్త్రంలో ఎన్నో లెక్కల చిక్కుముడులకు ఆమె పరిష్కారం చూపారు.

సరళ మరియు దీర్ఘవృత్తాకార సమీకరణాలను ఆమె రూపొందించారు. ఆమె తన తండ్రి దగ్గరే గణితం అభ్యసించారు. గణితం అంటే చిన్నతనంలో విపరీతమయిన ఇష్టం ఏర్పడింది. ఆమె తండ్రిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడంటూ అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. అప్పటికి ఆమె వయసు 15ఏళ్ళు మాత్రమే. జైలులో ఉండగానే తండ్రిని చంపేశారు. 

తండ్రి మరణానంతరం ఈమెకు ఏ యూనివర్శిటీలోనూ సీటు లభించలేదు. రష్యాలోనే పురాతనమయిన లెనిన్ గ్రాడ్ యూనివర్శిటీ సైతం అడ్మిషన్ కల్పించలేదు. జోసెఫ్ స్టాలిన్ మరణానంతరం రెండవసారి ఆమెకు అవకాశం వచ్చింది. ప్రఖ్యాత రష్యా గణిత శాస్త్రవేత్త, మేధావి ఇవాన్ పెట్రోవిస్కీ శిష్యురాలిగా డాక్టోరల్ థీసిస్ 1953లో యూనివర్శిటీకి అందచేసింది.

తనకు అడ్మిషన్ ఇవ్వని వర్శిటీనుంచే ప్రశంసలు పొందింది. అనంతరం లెనిన్ గ్రాడ్ యూనివర్శిటీకి చెందిన స్టెక్లావ్ ఇనిస్టిట్యూట్‌లో గణితం బోధించారు ఓల్గా. సోవియట్ రష్యా పతనం సమయంలో ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఆమె మరణానికి రెండేళ్ళ ముందు ఆమె గణితానికి చేసిన సేవలకు గాను Lomonosov Gold Medal సాధించింది. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   11 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle