యోగా యాప్స్.. ఎంచక్కా ఇంట్లోనే నేర్చుకోవచ్చు!
24-06-201924-06-2019 08:12:35 IST
2019-06-24T02:42:35.186Z24-06-2019 2019-06-24T02:42:22.960Z - - 12-04-2021

జీవితం బిజీగా మారిపోయింది. యోగా, ఎక్సర్ సైజ్లు చేయాలంటే కుదరడంలేదని తెగ ఇదైపోతున్నారు జనం. ముఖ్యంగా యోగా లాంటి సంప్రదాయిక విధానాలు అనుసరించడానికి కూడా సమయం చిక్కడం లేదని బాధపడేవారికి చక్కని ఉపాయం. యోగా యాప్స్. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ తో వివిధ యోగా యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుని హాయిగా యోగా చేర్చుకోవచ్చు. యోగా గో యాప్: ఈ యాప్లో ఫిట్నెస్తో పాటు అధిక బరువు నియంత్రించుకోవడానికి నియమాలు కూడా ఉంటాయి. ఏడు నిమిషాల నుంచి మొదలయ్యే యోగా 30 నిమిషాల వరకు ఉంటుంది. అంత సమయం కుదరదనే వారు పావుగంట ఉపయోగించుకోవచ్చు. బ్రీత్ యాప్ : యోగా చేసే ముందు శ్వాస తీసుకుని, వదలడం చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఆసనాల్లో ఎక్కువ సేపు ఉండగలుగుతాం..అందుకోసం ఈ బ్రీత్ యాప్ ఉపయోగపడుతుంది. ఇందులో.. శ్వాస ఎంతసేపు తీసుకోవాలి. అనేవి స్పష్టంగా ఉంటాయి. అంతేనా.. రోజూ మనం అనుకున్న సమయానికి యోగా చేయొచ్చని ఈ యాప్ సూచిస్తుంది. మినిట్ యాప్: మీకు సమయం తక్కువగా ఉన్నప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే చేసే యోగాసనాల గురించి ఈ యాప్ పూర్తిసమాచారం ఇస్తుంది. ఇందులోని ఆసనాలన్నీ ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి. ఈయాప్ ఉపయోగించడం కుదరడం లేదని మాత్రం సాకులు చెప్పకండి. పాకెట్ యాప్ : యోగాసనాలు వేయడంలో ఎన్నో సూచనలు ఇచ్చే ఈ యాప్.. ఏ భంగిమ ఎలా వేయాలో.. దాని వల్ల కలిగే లాభాలేంటో సూచిస్తుంది. మీకున్న ఆరోగ్యసమస్యల నుంచి ఈ యాప్ ద్వారా ఉపశమనం పొందవచ్చు. యోగా వేవ్ : ఈ యాప్ అప్పుడే యోగా నేర్చుకునేవారినుంచి నిష్ణాతులైనవారివరకూ అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. యోగా మాస్టర్ చెప్పే సలహాలు, సూచనలు పాటించాలి. దీనివల్ల శరీరం చక్కగా మారుతుంది. ఫిట్ స్టార్ యోగా : ఈ యాప్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఎంతగా బిజీగా ఉన్నా.. మీకున్న టైంలో ఈ యోగా నేర్చుకోవచ్చు. ఇలా ఎన్నో యాప్స్ మీకు మంచి యోగా సూత్రాలు నేర్పుతాయి. మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగం లేని వాటికి ఉపయోగించకుండా.. ఇలాంటి సింపుల్ టెక్నిక్ యోగా కోసం ఉపయోగించండి. ఒక వారం ఇందులో ఏదో ఒకి ఫాలో అవ్వండి. మీశారీరక, మానస్థిక పరిస్థితిలో వచ్చే మార్పులను గమనించండి.

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా