newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యూజర్లతో వొడాఫోన్ తొండాట!

17-01-201917-01-2019 15:16:22 IST
2019-01-17T09:46:22.053Z17-01-2019 2019-01-17T09:46:19.066Z - - 17-04-2021

యూజర్లతో వొడాఫోన్ తొండాట!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రిలయన్స్ జియో దెబ్బకు బెంబేలెత్తిన ఇతర టెలికామ్ ఆపరేటర్లు... తిరిగి కోలుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తొలుత జియోనే లేకుండా చేయడానికి గట్టిగా ట్రై చేశాయి కానీ... వీలు కాకపోవడం వల్ల దాని దారిలోకి వచ్చేశాయి. జియో తరహాలోనే వినూత్నమైన ప్లాన్స్ తీసుకువస్తున్నాయి. అయితే... అవి అంతగా సక్సెస్ కాకపోవడంతో అంతకుమించిన బంపరాఫర్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగానే జియోకి కౌంటర్‌గా వొడాఫోన్ సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

69 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.4 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్ఎస్‌ వంటి బెనిఫిట్స్ పొందేలా రూ.396 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇంతకుముందు ఇవే బెనిఫిట్స్‌తో రూ.399 ప్లాన్ ఉండేది. పెద్దగా వర్కవుట్ కాకపోతే... రూ.3 తగ్గించి దాన్నే కొత్త ప్లాన్‌గా మార్కెట్‌లో హల్‌చల్ చేయడం మొదలుపెట్టింది. దీంతోపాటు ఇటీవల రూ.169 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా లాంఛ్ చేసింది వొడాఫోన్! 28 రోజులు వ్యాలిడిటీ గల ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, నేషనల్ కాల్స్, నేషనల్ రోమింగ్, 3G/4G డేటా 1జీబీ, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

నిజానికి... రిలయన్స్ జియో రూ.399 ప్లాన్‌లో అవే బెనిఫిట్స్ ఇస్తూ 84 రోజులపాటు వ్యాలిడిటీ ఇస్తోంది. అంటే... వొడాఫోన్, ఇతర టెలికామ్ ఆపరేటర్లతో పోల్చుకుంటే జియో వ్యాలిడిటీ ఎక్కువ! ఇలాంటప్పుడు వొడాఫోన్ తీసుకొచ్చిన కొత్త ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది అనుమానమే!

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021

ఇంకా

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle