newssting
BITING NEWS :
* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

యూజర్లకు షాక్‌: మొబైల్‌ ఛార్జీలు పెరుగుతున్నాయ్‌..!

02-12-201902-12-2019 15:29:52 IST
2019-12-02T09:59:52.092Z02-12-2019 2019-12-02T09:59:47.922Z - - 25-05-2020

యూజర్లకు షాక్‌: మొబైల్‌ ఛార్జీలు పెరుగుతున్నాయ్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వరుసగా ధరలు తగ్గిస్తూ, ఉచిత డేటాలు, కాల్స్‌ ఇస్తూ వచ్చిన మొబైల్‌ సంస్థలు కొరడా ఝళిపించాయి. నాలుగేళ్ల తర్వాత తొలిసారి మొబైల్‌ కంపెనీలు టారిఫ్‌ ధరలను పెంచాయి. జియో, వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ యూజర్ల నెత్తిన పిడుగు వేశాయి. డేటా చార్జీలు, కాల్‌ ఛార్జీలు, రీఛార్జిల్లో గరిష్ఠంగా 42 శాతం వరకు పెంచేశాయి. వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ డిసెంబర్‌ 3 నుంచి ఛార్జీలు పెంచుతుంటే, జియో 6 నుంచి పెంచుతోంది. దీంతోపాటే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై కూడా నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తామని వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. జియో ఇప్పటికే ఈ పని చేసిన విషయం తెలిసిందే. 

ప్లాన్లు ఇలా ఉన్నాయ్‌!

వొడాఫోన్‌-ఐడియా...

అన్‌లిమిటెడ్‌ కేటగిరీ కింద 2, 28, 84, 365 రోజులతో వొడాఫోన్‌ ఐడియా కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున 84 రోజుల కాలపరిమితి ఉండే  రూ.458 ప్లాన్‌ ధరను రూ.599గా మార్చారు. రూ.199 ప్లాన్‌ ధరను రూ.249కి పెంచారు. ఏడాది వ్యాలిడిటీ ఉన్న అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌ ధర రూ.1699 ఉండగా.. దానిని రూ.2,399కి తీసుకొచ్చారు. ఈ అన్ని ప్లాన్లలో ఎఫ్‌యూపీ (ఫెయిర్‌ యూజ్‌ పాలసీ) లిమిట్‌ దాటిన తర్వాత చేసే ఇతర నెట్‌వర్క్‌ కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు వరకు వసూలు  చేస్తారు. 

ఎయిర్‌టెల్‌...

ఎయిర్‌టెల్‌లో ప్రస్తుతం ఉన్న 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ ధర రూ.249 ఉండగా.. దానిని రూ.298కి ఇస్తున్నారు. 82 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.448 ప్లాన్‌ ధరను రూ.598కి పెంచుతున్నారు. ఇందులోనూ ఎఫ్‌యూపీ లిమిట్‌ దాటిన తర్వాత చేసే ఇతర నెట్‌వర్క్‌ కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తారు. 

జియో... 

జియో వాయిస్‌, డేటా ఛార్జీలను 40 శాతం మేర పెంచుతోంది. అయితే మూడు రోజులు ఆలస్యంగా డిసెంబర్‌ 6 నుంచి కొత్త అన్‌లిమిటెడ్‌ ప్లాన్లు తీసుకొస్తోంది. కొత్త  ప్లాన్ల కింద దాదాపు 300 శాతం అదనపు ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామని తెలిపింది. కొత్త ప్లాన్స్‌లోనూ ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌లో ఎఫ్‌యూపీ లిమిట్‌ దాటగానే కాల్‌కు ఆరు పైసలు వసూలు చేస్తారు. అయితే ప్లాన్స్‌ వివరాలను జియో ఇంకా ప్రకటించలేదు. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle