newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యాప్‌తో పాటు ఇక టిక్ టాక్ స్మార్ట్ ఫోన్

08-06-201908-06-2019 15:19:34 IST
2019-06-08T09:49:34.009Z08-06-2019 2019-06-08T09:49:30.743Z - - 12-04-2021

యాప్‌తో పాటు ఇక టిక్ టాక్ స్మార్ట్ ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టిక్ టాక్.. యువతను బాగా ఆకట్టుకుంటున్న యాప్ అన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ యువతను బాగా చేరువ చేస్తోంది. టిక్‌ టాక్ వీడియో యాప్‌ కొద్ది కాలంలోనే ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఈ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.  రోజు రోజుకీ దీనికి ఆదరణ పెరిగిపోతోంది. మొబైల్‌లో ఈ యాప్‌ ఉందంటే చాలు.. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎక్కువ సేపు టిక్‌టాక్‌ వీడియోలను చూస్తూ కనిపిస్తున్నారు. పోర్నోగ్రఫీ కారణంగా ఇండియాలో టిక్ టాక్ కొంతకాలం నిషేధానికి గురైంది.

అప్పట్లో టిక్ టాక్ యాప్ రావడంలేదని అనేకమంది యువత తీవ్ర నిరాశకు గురైన సంగతి తెలిసిందే. యాపిల్, గూగుల్ సంస్థలు సైతం తమ ప్లేస్టోర్ల నుంచి కొద్దికాలం పాటు టిక్ టాక్ యాప్ డౌన్లోడ్ అవకాశం లేకుండా చేశాయి. అనంతరం మద్రాసు హైకోర్టులో టిక్ టాక్ సంస్థకు ఊరట లభించింది. కొన్ని పరిమితులతో మదురై ధర్మాసనం మధ్యంతర నిషేధం ఎత్తివేసింది.

ఫోర్నోగ్రఫీ వంటి వీడియోలను అప్‌లోడ్ చేయకూడదంటూ కొన్ని పరిమితులు విధిస్తూ  ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ విషయంలో వైఫల్యం చెందితే కోర్టు ధిక్కరణ కింద విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. పోర్నోగ్రఫీకి చెందిన వీడియోల కారణంగా ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి వీలు లేకుండా నిషేధం విధించాలంటూ ఏప్రిల్ మూడున హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

హైకోర్టు ఆదేశాలపై స్టే విధించడానికి సుప్రీం అంగీకరించలేదు. ఏప్రిల్ 18 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు యాపిల్ స్టోర్‌, గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌ను బ్లాక్‌ చేశారు. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ చైనా కంపెనీ బైట్ డ్యాన్స్‌ సుప్రీం కోర్టు తలుపు తట్టింది.

పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొంది. టిక్‌ టాక్‌ యాప్ నిషేధం కారణంగా తాము రోజుకు దాదాపు రూ.3.5 కోట్లు నష్టం పోయామని, వందలాదిమంది ఉద్యోగుల భద్రతకు చేటు కలుగుతోందని పేర్కొంది. దీంతో నిషేధం ఎత్తివేసింది. అప్పటినుంచి టిక్ టాక్ యాప్ మరింత పాపులర్ అయింది. తాజాగా టిక్ టాక్ సంస్థ నుంచి తాజా అప్ డేట్ యూత్ కి కిక్ ఇస్తోంది.

ఈ యాప్‌ నుంచి త్వరలో స్టార్ట్‌ఫోన్‌ కూడా రానుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. టిక్ టాక్ సంస్థను నడిపించే బైట్‌డ్యాన్స్‌  తన సొంత స్మార్ట్‌ఫోన్‌ తయారీలో నిమగ్నమైందని చెబుతున్నారు. దీనికి టిక్ టాక్ పేరు కలిసి వచ్చేలా“టిక్‌టాక్‌ ఫోన్‌” అనే పేరు ఖరారు చేశారు.

ఈ డివైజ్‌లో టిక్‌టాక్‌తోపాటు బైట్‌డ్యాన్స్‌ యాప్స్‌ కూడా ఉండనున్నాయి. ఫోన్‌కు సంబంధించి కొన్ని పేటెంట్‌ హక్కులు కూడా సంపాదించినట్లు తెలుస్తోంది. ఈఏడాది మధ్యభాగంలో టిక్ టాక్ ఫోన్ మోడల్ డివైజ్ బయటకు రానుంది. తొలుత ఖరీదు ఎక్కువగా ఉన్నా.. రానురాను దీని ధర అందుబాటులోకి తెస్తామంటోంది కంపెనీ. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle