newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యాపిల్, హువావేలకు దెబ్బే.... గూగుల్ పే డెబిట్ కార్డులు!

23-04-202023-04-2020 18:41:37 IST
Updated On 23-04-2020 18:46:46 ISTUpdated On 23-04-20202020-04-23T13:11:37.318Z23-04-2020 2020-04-23T13:11:30.017Z - 2020-04-23T13:16:46.451Z - 23-04-2020

యాపిల్, హువావేలకు దెబ్బే.... గూగుల్ పే డెబిట్ కార్డులు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత్ లో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరూ ఏటీఎంలకు వెళ్లి క్యాష్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా డిజిటల్ మనీ ట్రాన్స్ ఫర్లకు అలవాటు పడిపోయారు. ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఎప్పుడో గూగుల్ పే తీసుకువచ్చింది.దీని ద్వారా మీరు ఏ షాప్ దగ్గరకి వెళ్ళిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసే సౌలభ్యం కలిగింది. పైగా మీరు మీబ్యాంక్ అకౌంట్ ని దీనికి అనుసంధానం చేయడం ద్వారా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. 

ఈ లావాదేవీల అనంతరం మీకు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఒక్కోసారి వేలకు వేలు లాభం పొందినవారు కూడా వున్నారు. యాపిల్, హవావే తరహాలోనే గూగుల్ పే త్వరలో స్మార్ట్ డెబిట్ కార్డ్స్ లాంచ్ చేయనుంది. గూగుల్ పే యూజర్లకు ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గూగుల్ తాజాగా స్మార్ట్ పేమెంట్ కార్డ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి.

డెబిట్ కార్డులు లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది. గూగుల్ ఫిజికల్ పేమెంట్స్ కార్డు తీసుకువచ్చేందుకు పని చేస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీని పేరు గూగుల్ కార్డు, గూగుల్ పే కార్డు అవ్వొచ్చనే అంచనాలున్నాయి. యాపిల్ కార్డు మాదిరి కాకుండా గూగుల్ కార్డు డెబిట్ కార్డు అయ్యే అవకాశముంది. యాపిల్ సంస్థ తీసుకువచ్చింది మాత్రం క్రెడిట్ కార్డు.

ఇకపోతే గూగుల్ డెబిట్ కార్డు కో బ్రాండెడ్ కార్డు కావొచ్చని అంటున్నారు. గూగుల్ డెబిట్ కార్డు ఎలా వుండాలనేది కూడా అంచనాలు వస్తున్నాయి. సిటీ బ్యాంక్ వంటి పలు బ్యాంకులతో జతకట్టే అవకాశముంది. గూగుల్ డెబిట్ కార్డు తొలిగా వీసా చిప్‌‌తో మార్కెట్‌లోకి రావొచ్చు. తర్వాత మాస్టర్ కార్డు వంటి రూపంలో ఈ డెబిట్ కార్డులు అందుబాటులోకి రావొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.గూగుల్ పేమెంట్స్ యాప్ గూగుల్ పే ద్వారా కూడా గూగుల్ డెబిట్ కార్డు ఉపయోగించే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం గూగుల్ పే కేవలం ఆన్‌లైన్, పీ టు పీ ట్రాన్సాక్షన్ సర్వీసులు మాత్రమే అందిస్తోంది.

దీనికి పేమెంట్ కార్డు యాప్‌తో లింక్ చేసుకోవాలి. అదే డెబిట్ కార్డును ఎప్పుడు మార్కెట్‌లోకి తీసుకువస్తుందో కచ్చితంగా తెలియదు. అలాగే గూగుల్ కూడా డెబిట్ కార్డు నివేదికలను కన్ఫర్మ్ చేయలేదు. గూగుల్ పే యూజర్లు భారత్‌లో కోట్లాదిమంది ఉన్నారు. గూగుల్ పే లక్షలాదిమందికి చేరువ అయింది. ఇప్పుడు డెబిట్ కార్డులు కూడా వస్తే కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. 

 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   14 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle