newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యాపిల్ బిజినెస్‌పై కరోనా దెబ్బ

30-01-202030-01-2020 16:40:44 IST
2020-01-30T11:10:44.452Z30-01-2020 2020-01-30T11:10:36.665Z - - 23-04-2021

యాపిల్ బిజినెస్‌పై కరోనా దెబ్బ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ప్రొడక్ట్స్ తమ సత్తా చాటుతున్నాయి. భారతదేశంలో 2019లో యాపిల్ అమ్మకాలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ కారణంగా యాపిల్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ నుంచి బయటపడడానికి ఫాక్స్ కాన్ సంస్థ ఉద్యోగులకు మాస్క్ లు అందచేస్తోంది. చైనాలోని వివిధ నగరాల్లో ఉన్న సంస్థ కార్యాలయాల్లో ఈ వైరస్ వ్యాపించకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టామని యాపిల్ సీఈవో టిమ్ కుక్ చెప్పారు.

తైవాన్ లోని ఫాక్స్ కాన్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు అత్యంత శక్తిమంతమయిన మాస్క్ లు అందిస్తోంది. ఉద్యోగుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత నిస్తోంది. వారికి జలుబు, ఇతర అనారోగ్య సమస్యలు, జ్వరం లాంటివి వుంటే వైద్యులను పిలిపించి చికిత్స అందిస్తోంది. ఉత్పత్తికి అంతరాయం కలగకుండా వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

ఆఫీసుకి రాకుండా ఇంటిదగ్గర నుంచే వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీ కల్పించింది. వుహాన్ లోని ఫాక్స్ కాన్ ఫ్యాక్టరీ నుంచి ఎప్పటికప్పుడు అప్ డేట్ అందుకుంటోంది. యాపిల్ సంస్థకు తైవాన్ కి చెందిన ఓ కాంట్రాక్ట్ సంస్థ విడిపరికరాలను అందిస్తోంది. అక్కడ పనిచేసే ఉద్యోగులను ముందుజాగ్రత్తగా అప్రమత్తం చేసింది. 

కరోనా వైరస్ జ్వరం ద్వారా వ్యాపిస్తుంది. దీంతో ఉద్యోగుల టెంపరేచర్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. చైనా వ్యాప్తంగా యాపిల్ 5 కోట్ల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. అందులో 1.8 మిలియన్ల మంది సాఫ్ట వేర్ మరియు ఐవోఎస్ యాప్ డెవలపర్లు వున్నారు.

యాపిల్ సంస్థకు కాంట్రాక్ట్ కంపెనీలతో పాటు 10వేలమంది స్వంత ఉద్యోగులు ఉన్నారు. వీరంతా చైనాలో తయారైన విడి పరికరాలను అసెంబ్లింగ్ చేస్తున్నారు. 90 శాతం పైగా యాపిల్ ఉత్పత్తులు చైనాలోనే అసెంబ్లింగ్ చేస్తుంటారు. ఈవైరస్ బారిన పడ్డ వారికి యాపిల్ సంస్థ తరఫున సాయం చేస్తామని ట్వీట్ చేశారు టిమ్ కుక్. ఉద్యోగుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని, వారిని నిరంతరం పర్యవేక్షిస్తామంటోంది యాపిల్ సంస్థ. 

Image may contain: 1 person, smiling, possible text that says 'Tim Cook @tim_cook As people in China and around the world celebrate the Lunar New Year, we send our love and support to the many impacted by the Coronavirus. Apple will be donating to groups on the ground helping support all of those affected.'

చైనాలో యాపిల్ సంస్థకు ఐ క్లౌడ్ డేటా సెంటర్లు, రిటైల్ అవుట్ లెట్లు, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ లు వున్నాయి. వైరస్ నేపథ్యంలో వుహాన్ లో యాపిల్ అమ్మకాలను ఆపేశారు. జనవరి 27 నుంచి ఇక్కడ అమ్మకాలు కూడా తగ్గాయి. చైనాలోనూ అమ్మకాల సమయాలను కుదించింది. చైనాకు రాకపోకలు సాగించే యాపిల్ ఉద్యోగులను హెచ్చరిస్తోంది. 

 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle