newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యాపిల్ కంప్యూటర్‌ @ ₹ 12.3 కోట్లు

28-10-201928-10-2019 12:08:51 IST
2019-10-28T06:38:51.154Z28-10-2019 2019-10-28T06:38:44.794Z - - 15-04-2021

యాపిల్ కంప్యూటర్‌ @ ₹ 12.3 కోట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘‘ఏంటి... యాపిల్‌ కంప్యూటర్‌ 12 కోట్లా... నాకు తెలిసి యాపిల్‌ కంప్యూటర్లు ఎక్కువ రేటు అని తెలుసు కాని... మరీ ఇంతనా. ఏ లక్షో, లక్షన్నరో ఉంటుంది కానీ... మరీ ఇంత ఉంటుందా’’ ఇదేగా మీ ప్రశ్న. 

ఆగండాగండి ఈ కంప్యూటర్‌ గురించి తెలిస్తే మీరు ఆ మాట అనరు. వింటేజ్‌ కంప్యూటర్ల గురించి మీకు తెలుసు కదా.. అదేనండి పాతవైనా వైవిధ్యంగా ఉండే కంప్యూటర్లు. ఇది కూడా అలాంటిదే. ఈ-బేలో గ్యాడ్జెట్‌లు సెర్చ్‌ చేస్తున్న ఓ ఆంగ్ల టెక్‌ వెబ్‌సైట్‌ ప్రతినిధులు ఈ విషయాన్ని గమనించారు. అలనాటి యాపిల్‌-1 కంప్యూటర్‌ను ఓ యూజర్‌  $1.75 మిలియన్లకు అమ్మకానికి పెట్టారు. మన కరెన్సీ ప్రకారం దాని ధర ₹12.3 కోట్ల పై మాటే. అదీ విషయం.

యాపిల్‌ - 1 కంప్యూటర్లు చాలా ప్రత్యేకం. వీటిలో కొన్నింటిని చెక్క కేస్‌తో రూపొందించారు. ఇలాంటివి ప్రస్తుతం ఆరు మాత్రమే అందుబాటులో ఉన్నాయంట. ఇప్పుడు ఈ-బేలో అమ్మకానికి పెట్టిన యూజర్‌ సెకండ్‌ యూజర్‌ కావడం గమనార్హం. 1978లో ఈ కంప్యూటర్‌ను రూపొందించారు. అయితే ఈ మోడల్‌ కంప్యూటర్లకు ఈ స్థాయి ధర పలకడం ఇదేం తొలిసారి కాదు. 2016లో ఓ యాపిల్‌ - 1 కంప్యూటర్‌ $ 815,000 ధర పలికింది. అమ్మకానికి పెట్టిన యాపిల్‌ - 1 కంప్యూటర్‌లో మోనిటర్‌, కస్టమ్‌ వుడ్‌ కేస్‌ ఉంటుంది. బేసిక్‌ లాంగ్వేజ్‌తో డిజిటల్లీ లోడబుల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇస్తున్నారు. ఈ కంప్యూటర్‌ను యాపిల్‌ ఫౌండర్ స్టీవ్‌ జాబ్స్‌, కో ఫౌండర్‌ స్టీవ్‌ వోజ్నియాక్‌ తయారు చేశారు. 

కంప్యూటర్‌కు ఎందుకు అంత ధర పెట్టారు అని ఈ-బేలో పెట్టిన ఓనర్‌ను అడిగితే... ‘‘ప్రపంచంలో ఇంకా మిగిలిన ఉన్న ఆరు అరుదైన కంప్యూటర్లలో ఇది ఒకటి. దీనికి మ్యూజియం కలక్షన్‌గా భావిస్తాను. ఈ కంప్యూటర్‌ ఇప్పటికీ బెస్ట్‌ కండిషన్‌లో ఉంది. దుమ్మ, ధూళి ఇబ్బంది లేకుండా వుడ్‌ కేస్‌ కూడా ఏర్పాటు చేసి ఉంది’’ అని చెప్పాడు. ఇలాంటి రేర్‌ గ్యాడ్జెట్స్‌ ను ఎక్కువ ధర  ఉన్నా కొనుగోలు చేయడానికి చాలామందికి ముందుకు వస్తుంటారు. మరి ఈ కంప్యూటర్‌ను ఎవరు కొనుగోలు చేస్తారో... ఎంత ధర పెడతారో చూడాలి. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle