యాపిల్ ఆన్ లైన్ స్టోర్ ఆగయా..!
23-09-202023-09-2020 13:11:14 IST
Updated On 23-09-2020 13:15:29 ISTUpdated On 23-09-20202020-09-23T07:41:14.163Z23-09-2020 2020-09-23T07:41:05.862Z - 2020-09-23T07:45:29.436Z - 23-09-2020

యాపిల్ మొబైల్ ఫోన్స్ ను, యాపిల్ ప్రోడక్ట్స్ ను భారత్ లో వినియోగించే వారు చాలా ఎక్కువే..! కానీ భారతదేశంలో యాపిల్ ఆన్ లైన్ స్టోర్ అన్నది రాలేదు. ఇతర ఈకార్ట్ సంస్థలతో కలిసి యాపిల్ సంస్థ తమ ప్రోడక్ట్స్ ను అమ్ముతూ ఉండేది. ఇకపై నేరుగా యాపిల్ సంస్థ తమ సైట్ ద్వారా కూడా అమ్మకాలు జరపనుంది.
ఇకపై యాపిల్ ఇండియా అధికారిక వెబ్సైట్ (www.apple.com/in)ను సందర్శించి కావాల్సినవి కొనుగోలు చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడకుండా నేరుగా యాపిల్ సంస్థకు సంబంధించిన ప్రోడక్ట్స్ ను కొనుక్కోవచ్చు. ఇంకా డైరెక్ట్ కస్టమర్ సపోర్టు కూడా యూజర్లకు భిస్తుంది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు నైపుణ్యం కలిగిన తమ ఆన్లైన్ టీం సిద్ధంగా ఉన్నారని యాపిల్ ప్రకటించింది. ఆన్లైన్ స్టోర్ ద్వారా యాపిల్ మొదటిసారిగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు పూర్తి స్థాయి ఉత్పత్తులు, ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. రవాణా కోసం ఆపిల్ బ్లూడార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
యాపిల్ లాంచ్ చేసిన యాపిల్ వాచ్ సిరీస్ 6, కొత్త ఐప్యాడ్ ఎయిర్ తోపాటు, ఐఫోన్, ఐప్యాడ్, మాక్ లాంటి ఉత్పత్తులు ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 38 వ ఆన్లైన్ స్టోర్ ఆపిల్ ఇండియా స్టోర్ ద్వారా భారతీయ వినియోగదారులకు యాపిల్ నిపుణుల సలహాలు, సూచనలు అందుబాటులో ఉంటాయి.ప్రొడక్ట్ ఫీచర్ల గురించి మరింత తెలుసుకోవడం, సెటప్ చేయడం వరకు వినియోగదారులు ఇంగ్లీష్‌లో ఆన్లైన్ లో సాయం అందిస్తుంది. అలాగే ఫోన్ ద్వారా హిందీ ఇంగ్లీషులో నేరుగా సలహాలు ఇవ్వనున్నారు.
భారత దేశంలో యాపిల్ సంస్థ తమ ప్రోడక్ట్స్ ను అమ్మడానికి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మీద ఆధారపడి ఉండగా.. ఇకపై సొంత సైట్ ద్వారా జరపనుంది. యాపిల్ ఇండియా ఆన్ లైన్ స్టోర్ ద్వారా పాత ఐఫోన్ లను ఇచ్చేసి.. కొత్త ఐఫోన్ లను కొనుక్కోవచ్చు. యాపిల్ ఇండియా ఆన్ లైన్ స్టోర్ ద్వారా భారతదేశంలో యాపిల్ సంస్థకు చెందిన అన్ని ప్రోడక్ట్స్ ను అమ్మకానికి ఉంచనున్నారు. ఐపాడ్ లను, యాపిల్ ఎయిర్ పోడ్స్, హోమ్ పోడ్, స్మార్ట్ స్పీకర్స్, మ్యాక్ కంప్యూటర్లను.. ఇలా చాలా వాటిని అమ్మకానికి ఉంచనున్నారు. ఇతర దేశాల్లో యాపిల్ సంస్థ ఎలా పనులు చేస్తుందో భారత్ లో కూడా యాపిల్ ఇండియా ఆన్ లైన్ స్టోర్ ద్వారా అన్నీ పూర్తీ చేయనున్నారు. కస్టమర్లకు మరింత చేరువయ్యేలా కూడా చర్యలను చేపట్టారు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా