యాడ్స్ ఇస్తే తప్పేంటి... షావోమీ వాదన ఇది
20-10-201920-10-2019 13:05:54 IST
2019-10-20T07:35:54.946Z20-10-2019 2019-10-20T07:35:52.488Z - - 20-04-2021

బడ్జెట్ ఫోన్లలో భారత్ రారాజుగా వెలుగొందుతోంది షావోమీ. తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో గత కొన్ని రోజులుగా దూసుకుపోతోంది. ఈ విషయాన్ని చాలా సర్వేలు చెప్పాయి. బ్లాట్ వేరే కొద్దిగా ఎక్కువగా ఉంటుందనే మాటే కానీ... స్టాక్ ఆండ్రాయిడ్ లోని చాలా ఫీచర్లు ఇందులో ఉండటం వల్ల యూజర్లు ఆదరిస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చిన అసలు సమస్య యాడ్స్ తో. మొబైల్ ను కొనుగోలు చేసినప్పుడు ఇన్ బిల్ట్ గా వచ్చిన యాప్స్ లో యాడ్స్ వస్తుంటాయి. యూజర్లకు ఇవి ఒక్కోసారి అడ్డుగా ఉంటున్నాయి. దీంతో షావోమీ యాడ్లపై సోషల్ మీడియలో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. దీనిపై షావోమీ స్పందించింది. షావోమీ ఇప్పటివరకు 100 మిలియన్ల మొబైళ్లను మన మార్కెట్ కి తీసుకొచ్చింది. షావోమీ కస్టమ్ స్కిన్ ఎంఐయూఐని 80 మిలియన్ల మంది యూజర్లు వాడుతున్నారని సంస్థ చెబుతోంది. అయితే యూఐ వాడుతున్నప్పుడు ఆప్స్ రికమెండేషన్స్, యాడ్స్ కనిపిస్తుంటాయి. ఫైల్ మేనేజర్, సెక్యూరిటీ లాంటి సిస్టమ్ యూఐతో వచ్చే యాప్స్ లోనూ ఇలాంటి యాడ్స్ వస్తున్నాయి. అయితే యాడ్స్ విషయాన్ని షావోమీ వెనకేసుకొస్తోంది. ‘‘ఇది మా బిజినెస్ మోడల్... వాటిని తీసేయాలని మేం అనుకోవడం లేదు’’ అని చెబుతోంది. ఇటీవల కొంతమంది టెక్ నిపుణులు షావోమీ టీమ్ ని అడిగారు. అప్పుడు వారు చెప్పిన మాటే ఇది. రెడ్ మీ నోట్ 8 సిరీస్ ఈవెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. షావోమీ సీవోవో బి. మురళీకృష్ణను ఆంగ్ల మీడియా సంస్థ యాడ్స్ గురించి అడిగింది. ‘‘యూఐలో యాడ్స్ పెట్టడాన్ని మేం అన్ ఫెయిర్ అనుకోవడం లేదు. ఎందుకంటే మేం ఇంటర్నెట్ సర్వీసు పై ఫోకస్ పెట్టాం. యాడ్స్ అనేవి మా బిజినెస్ మోడల్ లో భాగం. మేమే కాదు ఫేస్ బుక్, గూగుల్ లాంటివి కూడా వాటి ప్రోడక్ట్స్ లో యాడ్స్ తీసుకొస్తున్నాయి’’ అని మురళీకృష్ణ చెప్పారు. ‘‘రికమెండేషన్స్, యాడ్స్ విషయంలో కొంతమందికి కన్ ఫ్యూజ్ ఉంది. దానిపై మేం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది’’ అని ఆయన చెప్పారు. కాబట్టి ఎంఐయూఐ 11 లోనూ యాడ్స్ కంటిన్యూ అవుతాయన్నమాట.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా