మోటో రేజర్... ఫీచర్లు సూపర్!
16-11-201916-11-2019 16:12:46 IST
2019-11-16T10:42:46.049Z16-11-2019 2019-11-16T10:42:41.637Z - - 22-04-2021

ఫోల్డబుల్ ఫోన్... రానున్న రోజుల్లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ విభాగంలో వీటిదే హవా అవుతుందా? ప్రస్తుతం టెక్ వర్గాల విశ్లేషణలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. శాంసంగ్ ‘ఫోల్డ్’తో రాగా... హువావే ‘ఎక్స్’తో వచ్చింది. తాజాగా మోటొరోలా ‘రేజర్’ను తీసుకొచ్చింది. మోటో రేజర్ (2019)గా పిలిచే ఈ మడత ఫోన్లో ఆసక్తికర ఫీచర్లున్నాయి!
మోటో రేజర్ ఆండ్రాయిడ్ 9 ‘పై’ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)తో పనిచేస్తుంది. యాప్ కంటిన్యుటీ, మోటో ఎక్స్పీరియన్స్ లాంటి ఫీచర్లు ఉంటాయి. స్టాక్ ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ని తీసుకొస్తున్నారు. త్వరలో ఆండ్రాయిడ్ 10కు అప్డేట్ ఇస్తున్నారు. ఈ మొబైల్లో క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్ ఉంటుంది. ఇది పాత ప్రాసెసర్ అయినప్పటికీ ఫోన్‌కు తగ్గట్టుగా మంచి పని తీరు ఉంటుందని మోటొరోలా చెబుతోంది.

మొబైల్లో 6.2 ఇంచీల డిస్ప్లే అమర్చారు. ఫోన్ ప్యానల్‌ని ప్లాస్టిక్‌తో తయారు చేశారు. లోపలి వైపు స్క్రీన్కు ప్లాస్టిక్ ప్రొటక్షన్ ఇచ్చారు. ముందు భాగంలో 2.7 అంగుళాల క్విక్ వ్యూ డిస్ప్లేని గ్లాస్‌తో తయారుచేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ ఉంటుంది. ఫోన్ దిగువన పెద్ద చిన్ ఉంటుంది. అక్క ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. పాత రేజర్ మోడల్ అనుభూతి కోసం ఫోన్లో రేజర్ యూఐ అనే ఫీచర్‌ని ఇస్తున్నారు. దీన్ని రెట్రో రేజర్ మోడ్ అని పిలుస్తున్నారు.
ఫోన్‌ను పూర్తిగా తెరిచినప్పుడు ఫోల్డ్ చేశామనే ఫీల్ లేకుండా స్క్రీన్‌ను చక్కగా పొందించారు. ఫోన్ ఎక్కువసార్లు మడతపెట్టినా డిస్ప్లేకి ఎటువంటి నష్టం జరగదని మోటో చెబుతోంది. ఈ ఫోన్‌కు వాటర్ రెసిస్టెన్స్ నానో కోటింగ్ వేశారు. దీని వల్ల నీటిలో పడినా పెద్ద ఇబ్బందేం ఉండదు. అలా అని ఎంతసేపు నీటిలో ఉంటే ఇబ్బంది ఉండదనేని సంస్థ చెప్పలేదు. త్వరలో ఈ విషయంలో స్పష్టత వస్తుంది. ఈ మొబైల్ ప్రస్తుతానికి నోయిర్ బ్లాక్ వేరియంట్లోనే లభ్యమవుతుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోల్డింగ్ మొబైల్స్‌తో పోలిస్తే మోటొరోలా రేజర్ ధర తక్కువే. ఈ ఫోన్ ధర 1,499.99 డాలర్లు. మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.07 లక్షలు. ప్రస్తుతానికి మొబైల్ అమ్మకాలు అమెరికాలోనే నిర్వహిస్తారు. జనవరి 9 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. వచ్చే నెల 26 నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకుంటారు. అయితే ఈ మొబైల్ మన దేశానికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంలో స్పష్టత లేదు.




థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
5 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా