newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోటో జీ సిరీస్‌ కొత్త మొబైల్‌ వచ్చింది... బాగా అలవాటైన ధరలో

25-10-201925-10-2019 13:06:42 IST
2019-10-25T07:36:42.156Z25-10-2019 2019-10-25T07:36:38.938Z - - 11-04-2021

మోటో జీ సిరీస్‌ కొత్త మొబైల్‌ వచ్చింది... బాగా అలవాటైన ధరలో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మోటొరోలా నుంచి వచ్చే మొబైళ్లలో జి సిరీస్‌ బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు చైనా సంస్థల మొబైల్స్‌ వచ్చి మోటొరోలా కాస్త వెనుకబడింది కానీ... ఒకప్పుడు మోటో జి సిరీస్‌ మొబైల్స్‌ ఎప్పుడొచ్చినా హాట్‌ టాపిక్‌గా ఉండేవి. బడ్జెట్‌ ధరలో అదరగొట్టేవి. అయితే ఇదే సమయంలో కాస్త ధర ఎక్కువ పెట్టి మోటొరోలా ధరలు కాస్త ఎక్కువ పెట్టి ఇబ్బంది కూడా పడింది. ఇప్పుడు జి సిరీస్‌లో జి8 వచ్చింది.  బడ్జెట్‌ ఫోన్ల మార్కెట్‌ లో బాగా అలవాటైన రూ.13,999 ధరతో తీసుకొచ్చారు. బ్రెజిల్‌ లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ సిరీస్‌ మొబైళ్లను లాంచ్‌ చేశారు. 

మోటో జీ8 ప్లస్‌ ప్రత్యేకతలు:

ఈ మొబైల్‌లో 6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ ప్లే ఉంటుంది. వాటర్‌ డ్రాప్‌ నాచ్‌లో కెమెరా ఇస్తున్నారు. ఇందులో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ ఉంటుంది. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంటుంది. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. టైప్‌ సీ ఛార్జర్‌తో 15వాట్‌ టర్బో ఛార్జింగ్‌ ఆప్షన్‌ను తీసుకొస్తున్నారు. ముందువైపు 25 ఎంపీ కెమెరా ఉంటుంది. వెనుకవైపు శాంసంగ్‌ ఐఎస్‌వో సెల్‌ బ్రైట్‌ జీఎం1 సెన్సర్‌తో 48 ఎంపీ కెమెరా ఉంటుంది. 16 ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా ఇచ్చారు. దీంతో 117 డిగ్రీల వైడ్‌ యాంగిల్‌ పొటోలు తీసుకోవచ్చు. దీంతోపాటు పోర్‌ట్రైట్‌ పొటోల కోసం 5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ తీసుకొస్తున్నారు. 

మోటో జీ8 ప్లస్‌ను మన మార్కెట్‌లోకి రూ.13,999 ధరకు తీసుకొస్తారని తెలుస్తోంది. కాస్మిక్‌ బ్లూ, క్రిస్టల్‌ పింక్‌ రంగుల్లో అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం. ఈ నెలాఖరులో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కి తీసుకొస్తున్నారు. మరి అందుబాటు ధరలో తీసుకురానున్న ఈ మొబైల్‌ ఏ మేర యూజర్లను ఆకట్టుకుంటుదో చూడాలి. దీంతోపాటు మోటో జీ8 ప్లే, మోటో ఈ6 ప్లే ను కూడా ఆవిష్కరించారు. అవి మన దేశానికి ఎప్పుడొస్తాయనేది త్వరలో తెలుస్తుంది.

Image result for motorola launched moto g8 plus in brazil

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   11 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle