newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మొబైల్ రీఛార్జ్ ఇబ్బందులకు చెక్.. ఏటీఎంకి వెళితే చాలు

08-04-202008-04-2020 17:11:33 IST
Updated On 08-04-2020 18:01:31 ISTUpdated On 08-04-20202020-04-08T11:41:33.224Z08-04-2020 2020-04-08T11:41:16.888Z - 2020-04-08T12:31:31.820Z - 08-04-2020

మొబైల్ రీఛార్జ్ ఇబ్బందులకు చెక్.. ఏటీఎంకి వెళితే చాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ అమలవుతున్నా కొందరికి రీఛార్జ్ ఇబ్బందులు అంతగా అనుభవంలోకి రావడంలేదు. స్టే హోం కారణంగా డేటా వినియోగం పెరిగింది. దీంతో  మొబైల్ రీచార్జ్ విషయంలో ఇబ్బందులు తప్పడంలేదు.  యాప్స్‌తో రీచార్జ్ చేసుకునేట‌ప్పుడు ఆటంకాలు ఏర్ప‌డుతున్నాయి. అందుకే ద‌గ్గ‌ర్లో ఉన్న ఏటియ‌మ్‌ల ద్వారా వొడాఫోన్‌, జియో, ఎయిర్‌టైల్ వంటి సంస్థ‌లు రీచార్జ్ చేసుకునే సౌకర్యం కల్పించాయి.

రిలయన్స్ జియో : టెలికాం రంగంలో జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్న రిలయన్స్ జియో తమ చందాదారులకు రీఛార్జ్ సమస్యలు కలగకుండా చర్యలు చేపట్టింది. తొమ్మిది బ్యాంకులతో రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించింది. జియో భారతదేశంలో 350 మిలియన్లకు పైగా చందాదారులను కలిగి ఉంది. ఈ బ్యాంక్ జాబితాలో SBI, యాక్సిస్ బ్యాంకు,  సిటీ బ్యాంక్, డిసిబి బ్యాంక్ వంటివి మరెన్నో ఉన్నాయి. రిలయన్స్ జియో చందాదారులు భారతదేశంలో పనిచేస్తున్న ఈ తొమ్మిది బ్యాంకుల్లో దాదాపు 90,000 ఏటిఎంలలో రీఛార్జిని పొందగలుగుతారు.

వొడాఫొన్ : వోడాఫోన్ ఐడియా 2020 ఏప్రిల్ 17 వరకు దాదాపు 100 మిలియన్ ప్రీపెయిడ్ చందాదారుల యాక్సిస్ ను పెంచింది. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్, భారతి ఎయిర్‌టెల్ వంటి ఇతర టెల్కోలు కూడా ప్రీపెయిడ్ ప్లాన్ల చెల్లుబాటును పెంచడమే కాకుండా టాక్ టైమ్ క్రెడిట్ ను కూడా చందాదారుల అకౌంట్ లలో జమచేశారు. దీంతో ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా పోయింది. పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. 

ఎయిర్‌టెల్ :ఇండియాలో భారతి ఎయిర్‌టెల్‌ సుమారు 100 మిలియన్లకు పైగా చందాదారులను కలిగి ఉంది. లాక్ డౌన్ కారణంగా  ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు భారతి ఎయిర్‌టెల్ తన చందాదారులకు రీఛార్జ్ సదుపాయాన్ని కల్పించడానికి హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్‌లతో ఒప్పందం కుదర్చుకుంది. అపోలో ఫార్మసీలతో పాటు బిగ్ బజార్ కిరాణా దుకాణాలలోనూ తమ చందాదారులు మొబైల్ రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించింది. 

ఏటీఎంలలో రీఛార్జ్ చేయడం ఎలాగో తెలుసా?

*మొదటగా మీ యొక్క simను రీఛార్జ్ చేయడానికి అనుమతిస్తున్న బ్యాంక్ ఏదో కనుక్కోవాలి 

* మీ బ్యాంక్ ఏటీఎం కార్డును ఏటీఎంలో ఇన్ సర్ట్ చేసి.. భాషను ఎంచుకోవాలి.

*అనంతరం మొబైల్ రీఛార్జ్ అనే ఎంపిక మీద క్లిక్ చేయాలి. వెంటనే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి

* మీరు రీఛార్జ్ చేయవలసిన ప్లాన్ ను ఎంపికచేసుకుని.... ఏటీఎం కార్డు పిన్ నెంబర్ నొక్కాలి.

* ఈ ప్రక్రియ పూర్తయితే మీ మొబైల్ రీఛార్జ్ అయినట్టు మెసేజ్ వస్తుంది. మీ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అవుతాయి. యాప్ ల వల్ల ఇబ్బందులు పడేవారు ఈ ఆప్షన్ ద్వారా తమ మొబైల్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle