మొబైల్ ఫోన్లు జేబులో పెట్టుకోకూడదా?
09-10-201809-10-2018 05:30:00 IST
Updated On 09-10-2018 11:29:09 ISTUpdated On 09-10-20182018-10-09T00:00:00.000Z09-10-2018 2018-10-09T00:00:00.000Z - 2018-10-09T05:59:09.409Z - 09-10-2018

మనలో ఏ ఒక్కరూ మొబైల్ ఫోన్ లేకుండా ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టడం లేదు. మొబైల్ పాడైతే.. గంటల్లో కొత్త మొబైల్స్ కొనేస్తున్నారు. ఒక్కరోజు మొబైల్ లేకుండా ఊహించలేం. ప్రస్తుత అధ్యయనాల ప్రకారం మొబైల్ ఫోన్లతో రోజంతా గడపటం ఎంతవరకూ శ్రేయస్కరం అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్‌పై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యనిపుణులు చెప్పేది ఏంటంటే మొబైల్ ఫోన్ ను షర్టు లేదా పాంటు జేబుల్లో పెట్టుకుని తిరగడం అంత మంచిది కాదు. పాంటు జేబులో మొబైల్ ఫోన్ పెట్టుకోవడం వల్ల మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం పడుతుందని చెబుతున్నార. మొబైల్ ఫోన్ల నుండి వచ్చే రేడియేషన్ వల్ల వీర్యకణాల సంఖ్య, వాటి కదలిక తగ్గుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి, డిఎన్ ఎ కూడా పాడవ్వచ్చు. సెల్ ఫోన్లు షర్టు జేబుల్లో కూడా అంత సురక్షితం కాదు. కాన్సర్ రిస్క్‌ను పెంచుతాయి. మొబైల్ ఫోన్ల వల్ల ప్రమాదం వాటి సిగ్నళ్ళ స్వభావం వల్ల కలుగుతుంది. మొబైల్ ఫోన్లు రేడియో తరంగాలను యాంటెన్నా ద్వారా విడుదల చేస్తాయి. మీరు మొబైల్‌ను శరీరానికి దగ్గరగా పెట్టుకుని వాడితే, కణజాలాలు ఆ శక్తిని పీల్చుకోవచ్చు. వేడి వల్ల వాటి సామర్ధ్యం తగ్గవచ్చు. మొబైల్ ఫోన్ల వాడకాన్ని నియంత్రించడం సాధ్యం కాకపోయినా, మీ జేబుల్లో తీసుకెళ్ళకుండా కనీసం బ్యాగ్ లేదా చేతిలో పట్టుకుతిరిగి రిస్క్ తగ్గించుకోండి.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా