మొబైల్ ఫోన్లపై భారీగా జీఎస్టీ పెంపు..
15-03-202015-03-2020 08:19:18 IST
2020-03-15T02:49:18.176Z15-03-2020 2020-03-15T02:49:09.100Z - - 23-04-2021

కొత్తగా మొబైల్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి జీఎస్టీ రూపంలో భారీ షాక్ తగిలింది. మొబైల్ ఫోన్లు, కొన్ని విడిభాగాలపై ఉన్న జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచినట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ శనివారం చేసిన ప్రకటన స్మార్ట్ ఫోన్ తయారీ పరిశ్రమలో ప్రకంపనలు రేపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన 39వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మొబైల్ ఫోన్లు మరింత ప్రియం కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే తాజా నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. అందరూ ఊహించినట్టుగానే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ (జీఎస్టీ కౌన్సిల్) తాజాగా మొబైల్ ఫోన్లపై జీఎస్టీ పెంపునకు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన శనివారం నాటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మొబైల్ ఫోన్లపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వీటిపై 5 శాతం మాత్రమే ఉంది. అయితే ప్రభుత్వ నిర్ణయం అటు వినియోగదారులతోపాటు, స్థానిక ఉత్పత్తిదారులకు కూడా హానికరమని మొబైల్ హ్యాండ్సెట్లు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ సంస్థ ఆర్థిక మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత స్థాయి 12 శాతం నుండి మొబైల్ ఫోన్ల జీఎస్టీ రేటు పెరుగుదలకు ఇది సరైన సమయం కాదని విమర్శించింది. మొబైల్ ఫోన్లు, విబి భాగాలు ఇన్పుట్లపై జీఎస్టీన ద్వారా ఇబ్బందుల్లో పడిన సంస్థపై, తాజా జీఎస్టీ పెంపు విచిత్రమైన చర్య అని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు. భారత్‌లో స్మార్ట్ ఫోన్ అమ్మకం దారులు ఫోన్ల సరఫరా విషయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చైనాలో మొదలైన కరోనా వైరస్ మహమ్మారిగా మారి అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో చైనా మొబైల్ తయారీ పరిశ్రమలు మూకుమ్మడిగా మూసివేతకు గురయ్యాయి. రెండు నెలల తర్వాత ఫ్యాక్టరీలు చైనాలో ఇటీవలే ప్రారంభమైనప్పటికీ అవి చాలా కనిష్ట స్థాయిల్లో మాత్రమే పనిచేస్తున్నాయి. కారణం కరోనా ప్రభావంతో తమతమ ప్రాంతాలకు వెళ్లిపోయిన కార్మికులు ఇంకా తిరిగిరాలేదు. జీఎస్టీని పెంచితే కుప్పకూలడం ఖాయం.. జియోమీ ఎండీ స్మార్ట్ ఫోన్ పరిశ్రమ ఇప్పటికే లాభదాయకత విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ పడిపోతున్నందున కంపెనీలు ద్రవ్య విలువకు సంబంధించి ప్రతిష్టంభనను ఎదుర్కొంటున్నాయని జియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ విచారం వ్యక్తం చేశారు. రూపాయి విలువ పతనమవుతున్నందున ప్రతి ఒక్కరూ జీఎస్టీ భారీ పెంపుతో మొబైల్స్ ధరను తప్పనిసరిగా పెంచాల్సి వస్తుదని మను జైన్ హెచ్చరించారు. ఇది మొబైల్ పరిశ్రమలో మేక్ ఇండియా కార్యక్రమాన్ని మరింత బలహీన పరుస్తుందని హెచ్చరించారు. చైనా నుంచి మొబైల్ పరికరాల విడిభాగాల సరఫరా వ్యవస్థ కోవిడ్ 19 దెబ్బతో నిలిచిపోయిన కారణంగా భారతీయ మొబైల్ పరిశ్రమ ప్రతిష్టంభనను ఎదుర్కొంటోందని, కాబట్టి జీఎస్టీ పెంపుదలపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పునరాలోచించాలని జియోమీ ఎండీ అభ్యర్థించారు. కనీసం 15 వేల రూపాయల లోపు ధర ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్ల ధరలను జీఎస్టీ పెంపునుంచి తక్షణం మినహాయించాలని మను జైన్ కోరారు.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
a day ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా