newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మొబైల్ ఛార్జింగ్.. మనం ఎక్కువగా చేసే తప్పులు ఇవే!

11-06-202011-06-2020 20:15:29 IST
2020-06-11T14:45:29.879Z11-06-2020 2020-06-11T14:43:39.189Z - - 17-04-2021

మొబైల్ ఛార్జింగ్.. మనం ఎక్కువగా చేసే తప్పులు ఇవే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతోంది యువత. ఈ నేపథ్యంలో కొత్త మోడల్ వస్తే వాటిని కొని పడేస్తున్నారు. స్మార్ట్ ఫోన్  విడిచి యువత ఒక్క క్షణం కూడా ఉండలేరు. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడినా ఛార్జింగ్ విషయంలో పదే పదే పొరబాట్లు చేస్తుంటారు . ఈ లో బ్యాటరీ వార్నింగ్ వారిని చికాకు పెడుతుంటుంది. అందుకే ఇటీవల పవర్ బ్యాంక్ ల వినియోగం బాగా పెరిగింది. ఇంట్లో, ఆఫీసుల్లో  ఫోన్లు ఛార్జింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  లో బ్యాటరీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. బ్యాటరీ లైఫ్ ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి. ఫోన్ల ఛార్జింగ్ విషయంలో మనం చేసే పొరపాట్లు, వాటినుంచి ఎలా బయటపడాలో చూద్దాం.

40-80 శాతం ఛార్జింగ్ 

గతంతో పోలిస్తే సెల్ ఫోన్ బ్యాటరీల సామర్ధ్యం బాగా పెరిగింది. ఒకప్పుడు రాజ్యమేలిన నోకియా ఫోన్లు ఛార్జింగ్ విషయంలో చాలా వెసులుబాటుగా వుండేవి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే రెండుమూడురోజులు వచ్చేవి. కానీ ఇప్పుడంత సీన్ లేదు, సోషల్ మీడియా, యూట్యూబ్ వాడకం, వైఫై కారణంగా ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. అంతేకాదు గతంలో బ్యాటరీలకు చాలా తేడా వుంటోంది. ఒకప్పుడు సెల్ ఫోన్స్‌లో నికెల్ బ్యాటరీస్ వాడేవారు కాని ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ వాడుతున్నారు. అయితే ఈ రెండింటికీ చాలా తేడా ఉందని గుర్తుంచుకోవాలి, నికెల్ బ్యాటరీస్ వాడే సమయంలో అందులో ఉన్న ఛార్జింగ్ మొత్తం అయిపోయేవరకు వాడి ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టమని కంపెనీలు చెప్పేవి. కాని ఇప్పుడు వస్తున్న లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్కువ కాలం మన్నాలంటే 40-80 శాతం ఛార్జింగ్ పాటించాలని కంపెనీలు చెబుతున్నాయి. కాబట్టి మీరు ఈ సూత్రం పాటించండి. మీ బ్యాటరీ సామర్ధ్యం పెరుగుతుంది. 

జీరో ఛార్జింగ్ వద్దంటే వద్దు

ఇప్పుడు మీ ఫోన్ ని 0-100 శాతం వరకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టడం మానేయండి. ఇలా చేస్తే ప్రతీ సారి బ్యాటరీ ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. చాలామంది చివరి వరకూ వాడేస్తారు. దీనివల్ల బ్యాటరీ అయిపోయి జీరోకి వచ్చేస్తుంది. మళ్లీ ఛార్జింగ్ పెట్టి 50 శాతం అయ్యేసరికి బ్యాటరీ వేడెక్కిపోతుంది. అలా కాకుండా మీరు మీ ఫోన్ బ్యాటరీ 40 శాతం బ్యాటరీ మిగిలుండగానే ఛార్జింగ్ పెట్టి 80 శాతం వచ్చాక ఛార్జింగ్ తీసేయండి. ఒకవేళ ఛార్జింగ్ 40 శాతం కన్నా తక్కువగా ఉంటే కనీసం 20 శాతం ఉండేటట్టు చూసుకోండి. అంతేగాని జీరో బ్యాలెన్స్ అకౌంట్లా మాత్రం చేయకండి, అలా చేస్తే మీ బ్యాటరీ లైఫ్ పాడవుతుంది. 

80శాతం మించి ఛార్జింగ్ వద్దు

నికెల్ బ్యాటరీస్ కంటే లిథియం బ్యాటరీలు చాలా డెలికేట్ గా వుంటాయి. వాటిని 0-20 అలాగే 80-100 వరకు ఛార్జింగ్ పెడితే లిథియం అయాన్ బ్యాటరీస్ త్వరగా దెబ్బతింటాయి. ఏళ్ల తరబడి రావాల్సిన బ్యాటరీస్ కొన్ని నెలలకే పాడయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు 20 శాతం కంటే తక్కువ బ్యాటరీ వచ్చేలా వాడవద్దు. అలాగే 80 శాతం బ్యాటరీ వుంటే వెంటనే ఫోన్ ఛార్జింగ్ పెట్టవద్దు. 

బ్యాటరీ ఓవర్ హీట్.. బ్యాటరీ లైఫ్ డ్యామేజ్ 

అయాన్ బ్యాటరీస్ ను ఓవర్ హీట్ చేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీస్ ను ఓవర్ హీట్ చేస్తే దాదాపు 35 శాతం వరకు బ్యాటరీ శక్తిని కోల్పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు, కాబట్టి స్మార్ట్ ఫోన్ అదేపరిగా వాడవద్దని అంటున్నారు, ఒక్క సారికి 40 శాతం కన్నా ఎక్కువ ఛార్జింగ్ పెట్టకూడదు.  లిథియం అయాన్ బ్యాటరీస్ ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒక్క సారికి 40 శాతం కన్నా ఎక్కువ ఛార్జింగ్ పెట్టకూడదట. అలా చేస్తే మీ ఫోన్ బ్యాటరీ తొందరగా పాడవుతుందట. 40 శాతం ఛార్జింగ్ పెట్టి కాసేపు గ్యాప్ ఇవ్వాలి.  ఆతర్వాత మరో 40 శాతం ఛార్జింగ్ ఎక్కాక మీ ఫోన్ ఛార్జింగ్ ఫ్లగ్ నుంచి తీసేయండి.

ఎక్కువసార్లు ఛార్జింగ్ మంచిది కాదు 

మనలో చాలామంది బ్యాటరీ ఛార్జింగ్ పెడుతూనే వుంటారు. అలా కాకుండా ఎక్కువ శాతం ఛార్జింగ్ పెడితే ... 1500 సార్లు ఛార్జింగ్ పెడితే 10 శాతం శక్తిని కోల్పోయే బ్యాటరీస్ .. కేవలం 400 సార్లకే 35 శాతం శక్తిని కోల్పోతుందని వారంటున్నారు. అందుకే ఎక్కువ సార్లు ఫ్లగ్ తో ఫోన్ వుంచకండి. అంతేకాదు మీ ఫోన్ ఛార్జింగ్ ఎక్కకపోయినా ఫ్లగ్ తో అలా వుంచితే కూడా బ్యాటరీ సామర్ధ్యం తగ్గిపోవడం ఖాయం. 

ఛార్జింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడవద్దు

అనేకమంది చేసే పొరబాటు ఇదే. ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని ఛార్జింగ్ లో పెట్టి గడగడా మాట్లాడేస్తుంటారు. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ కావడం, చెవికి డామేజ్ అవడం జరుగుతుంది. అలాచేయడం వల్ల బ్యాటరీ లైఫ్ కూడా పాడవుతుంది. బ్యాటరీ ఛార్జింగ్ సామర్ధ్యం కూడా తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఫోన్ పేలిపోయి ప్రాణాలు కూడా పోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జింగ్ లో వున్నప్పుడు ఫోన్ వాడవద్దు. 

బ్రాండెడ్ బ్యాటరీలే వాడాలి

చాలామంది బ్యాటరీ పాడయిందని మార్కెట్లో దొరికే నాణ్యత లేని లోకల్ బ్రాండ్ బ్యాటరీలు వాడేస్తుంటారు. దీనివల్ల మీ ఫోన్ పాడవుతుంది. ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. కంపెనీ ఆథరైజ్డ్ షోరూంలోనే మీరు బ్యాటరీ మార్చుకోవాలి. పదే పదే ఫోన్ ఆఫ్ చేయడం వల్ల కూడా బ్యాటరీ తగ్గిపోతుంది. అయితే ఏమైనా ఫోన్ హ్యాంగ్ అయితే మాత్రం రీబూట్ చేసుకోవడం మంచిది. ఒకసారి ఛార్జింగ్ చేశాక అది 40 శాతం తగ్గేవరకూ ఫ్లగ్ పెట్టవద్దు. 

రాత్రంతా ఛార్జింగ్ పెట్టవద్దు

చాలామంది రాత్రి ఛార్జింగ్ పెట్టేసి హాయిగా పడుకుంటారు. కాని ఇది మంచిది కాదని అంతా గ్రహించాలి. మీ ఫోన్ 40-80 శాతం ఛార్జింగ్ అయిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ నుంచి తీసేయండి. ఉదయం వరకూ ఛార్జింగ్ చేయడంవల్ల బ్యాటరీ హీట్ ఎక్కుతుంది. మీ ఫోన్ కి కరెంట్ సరఫరా జరుగుతూనే వుంటుంది. ఒక్కోసారి వర్షాలు పడ్డప్పుడు, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల బ్యాటరీ పాడవుతుంది. మీ కరెంట్ బిల్లుకూడా ఎక్కువగా రావచ్చు.  అలాగే ఫోన్ హీటెక్కితే ఫ్రిజ్ లో పెడతారు. అది కూడా మంచి పద్దతి కాదు. ఫోన్ సాధారణ ఉష్షోగ్రతలో ఉంచితే సరిపోతుంది. 

బ్లూటూత్, వైఫై, జీపీఎస్ ఆపేయండి

మీకు అవసరం లేకుంటే కొన్ని యాప్స్ ఆపేయండి. సాధారణంగా కొంతమంది బ్లూటూత్, వైఫై, జీపీఎస్ అవసరం లేకున్నా ఫోన్లో ఆన్ లో వుంచుతారు. కానీ అలా చేయడం మీ ఫోన్ కి ఎంతమాత్రం మంచిదికాదని గ్రహించండి. వాటిని ఆపేయడం వల్ల ఫోన్ పై భారం తగ్గుతుంది. బ్యాటరీ వినియోగం కూడా తగ్గుతుంది. మీరు పనిచేసినంత సేపు వైఫై ఆన్ చేసుకోండి. బ్లూటూత్, జీపీఎస్ అంత అవసరం వుండదు కాబట్టి వాటిని ఆఫ్ చేయడం బెటర్. ఈ మెలకువలు పాటిస్తే మీ బ్యాటరీ సామర్ధ్యం పెరుగుతుంది. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle