newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

మొబైల్‌ తయారీ దారులపై గూగుల్‌ ఒత్తిడి చేస్తోందా?

09-10-201909-10-2019 10:38:35 IST
Updated On 09-10-2019 10:42:23 ISTUpdated On 09-10-20192019-10-09T05:08:35.736Z09-10-2019 2019-10-09T05:08:21.630Z - 2019-10-09T05:12:23.434Z - 09-10-2019

మొబైల్‌ తయారీ దారులపై గూగుల్‌ ఒత్తిడి చేస్తోందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆండ్రాయిడ్‌తో ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో దూసుకుపోతున్న గూగుల్‌కు ఉన్న ఇబ్బందుల్లో నేవిగేషన్‌ ఒకటి. గత రెండు ఆండ్రాయిడ్ వెర్షన్లలో అభిమానులు పెదవి విరుస్తున్న ఆప్షన్‌ అదే. ఫిజికల్‌ బటన్స్‌ కాకుండా కొత్తగా తీసుకొచ్చిన టూ బటన్‌ డిజైన్‌ను యూజర్లకు పెద్దగా నచ్చడం లేదు. ఆండ్రాయిడ్‌ ‘పై’ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ 10లోనూ కొనసాగింది. కొత్త ఓఎస్‌లో అయితే ఫుల్‌ గెస్చర్‌ మోడ్‌ను తీసుకొచ్చింది. యూజర్లకు ఈ విధానం నచ్చకపోయినా బలవంతంగా రుద్దేలా చర్యలు ప్రారంభించిందని తెలుస్తోంది.

ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (ఓఈఎమ్‌)తో గూగుల్‌ కుదుర్చుకున్న అగ్రిమెంట్‌ కాపీ ఒకటి ఇటీవల బయటపడింది. అందులో ఈ గెస్చర్స్‌ విషయం బయటపడింది. ఆ అగ్రిమెంట్‌ ప్రకారం చూస్తే గూగుల్‌ కొత్త గెస్చర్లను తమ కొత్త మొబైల్స్‌లో కచ్చితంగా తీసుకురావాలని కోరుతున్నట్లు అర్థమవుతుంది. అంటే ఇకపై మొబైల్‌ కంపెనీలు సొంత గెస్చర్స్‌ విధానాన్ని నిలిపేసి.. గూగుల్‌ గెస్చర్స్‌ను కచ్చితంగా వినియోగించాల్సి వస్తుంది. 

ఈ ఏడాది జరిగిన గూగుల్‌ I/O లో గూగుల్‌ తన గెస్చర్‌ విధానం, త్రీ బటన్‌ నేవిగేషన్‌ విధానాన్ని సపోర్టు చేస్తామని చెప్పింది.  ఓఈఎమ్స్‌ తమ సొంత గెస్చర్స్‌ వాడొద్దని చెప్పలేదు. అలా అని గూగుల్‌ గెస్చర్స్‌ను కచ్చితం చేస్తున్నట్లు ప్రకటించలేదు కూడా. దీంతో శాంసంగ్‌, వన్‌ప్లస్‌ లాంటి ఓఈఎమ్స్‌ సొంత యూఐల మీద గెస్చర్స్‌ను అభివృద్ధి చేసుకున్నాయి. వాటినే ఇప్పుడు యూజర్లు వాడుతున్నారు. కానీ ఇప్పుడు కొత్త అగ్రిమెంట్‌ ప్రకారం చూస్తే... ఏ మొబైల్‌ తయారీ సంస్థ అయినా గూగుల్‌ గెస్చర్స్‌ను కానీ, త్రీ బటన్‌ నేవిగేషన్‌ మెనూను వాడాల్సి ఉంటుంది. 

మొబైల్‌లో ఎలాంటి నేవిగేషన్‌ ఉండాలనేది యూజర్లు నిర్ణయించుకోవచ్చు. కానీ ఆండ్రాయిడ్‌ 10 వచ్చాక ఈ ఆప్షన్‌ లేకుండా పోయింది. గూగుల్‌ ఇస్తున్న స్వైప్‌ గెస్చర్స్‌నే వాడాల్సి వస్తోంది. దీంతో మొబైల్‌ తయారీ సంస్థలు ఎంతో కష్టపడి సిద్ధం చేసుకున్న నేవిగేషన్‌ విధానం బూడిదలో పోసిన పన్నీరే అని పరిశీలకులు చెబుతున్నారు.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle