మొబైల్ చార్జీల మోత తప్పదు.. యూజర్ల గుండెల్లో గుబులు
22-11-201922-11-2019 09:57:20 IST
2019-11-22T04:27:20.571Z22-11-2019 2019-11-22T04:27:18.317Z - - 14-04-2021

గత పదిహేనేళ్లుగా మొబైల్ చార్జీల విషయంలో వెసులుబాటును అనుభవించిన భారత వినియోగదారులకు మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్లు ఇకపై చుక్కలు చూపించడం ఖాయమని స్పష్టమవుతోంది. లైసెన్సు ఫీజులు, వడ్డీలు కలుపుకుని వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్ కంపెనీలు దాదాపు 40 వేల కోట్ల రూపాయలను కేంద్రప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన నేపథ్యంలో డిసెంబర్లో టారిఫ్లు పెంచుతామని మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్లు ప్రకటించాయి. దీనితో వినియోగదారుల గుండెల్లో కాస్త గుబులు మొదలయింది. దేశంలో మూడు దిగ్గజ మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్లయిన వొడాఫోన్ ఐడియా, రిలయెన్స్ జియో, భారతి ఎయిర్టెల్ కంపెనీలు తమపై ఆర్థిక భారాన్ని తప్పించుకోవడం కోసం మొబైల్ టారిఫ్లు పెంచుతామని ప్రకటించాయి. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి పెంచుతామని వొడాఫోన్ ఐడియా ప్రకటించగా, తేదీ చెప్పకుండా డిసెంబర్లో పెంచుతామని భారతి ఎయిర్టెల్ కంపెనీ ప్రకటించాయి. తామూ టారిఫ్లను సముచితంగా కొన్ని వారాల్లో పెంచుతామని రిలయెన్స్ జియో ప్రకటించింది. లైసెన్స్ ఫీజులు, వడ్డీలు కలుపుకొని వొడాఫోన్ 28 వేలు, భారతి ఎయిర్టెల్ 12 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలంటూ 16 ఏళ్ల వివాదానికి తెరదించుతూ సుప్రీం కోర్టు ఇటీవలనే తీర్పు చెప్పింది. ఈ రెండు కంపెనీలు గత సెప్టెంబర్లో విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల ప్రకారం వీటికి ఉమ్మడిగా 73 వేల కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయాలంటే మొత్తం లక్ష కోట్ల రూపాయలు దాటుతుంది. మొబైల్ టారిఫ్లను ఎంత పెంచితే ఈ కంపెనీలు నష్టాల నుంచి గట్టెక్కుతాయి ఈ నేపథ్యంలో మొబైల్ చార్జీల మోత మోగుతుందని మొబైల్ యూజర్లు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారం రీత్యా వొడాఫోన్ దేశంలో మొదటి స్థానంలో ఉండగా రిలయెన్స్ రెండో స్థానంలో, ఎయిర్టెల్ మూడో స్థానంలో కొనసాగుతోంది. రిలయెన్స్ జియో లాభాలు కూడా ఈ ఏడాది దాదాపు 600 కోట్ల నుంచి 900 కోట్ల రూపాయలకు చేరుకుంది. రిలయెన్స్ కంపెనీ 2016లో జియోను తీసుకరావడం, దాదాపు ఏడాది పాటు ఉచిత సేవలు అందించడంతో వొడాఫోన్, ఎయిర్టెల్ కంపెనీలు పోటీకి పోయి బాగా నష్టపోయాయి. వొడాఫోన్ ఐడియా అన్ని టారిఫ్లను పది శాతం పెంచుతున్నట్లు, ఆ టారిఫ్లను చూసిన తర్వాత అంతకన్నా కొంచెం తక్కువగా టారిఫ్లను పెంచాలని ఎయిర్టెల్ చూస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వాటికంటే జియో టారిఫ్లు తక్కువగానే పెరిగే అవకాశం ఉంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా