newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మొబైల్స్‌ అనుకున్నంత చెడ్డవి కావంట.. పరిశోధకులు మాటిది!

25-11-201925-11-2019 17:05:50 IST
2019-11-25T11:35:50.175Z25-11-2019 2019-11-25T11:35:47.529Z - - 14-04-2021

మొబైల్స్‌ అనుకున్నంత చెడ్డవి కావంట.. పరిశోధకులు మాటిది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
‘అస్తమానం ఆ ఫోన్‌ పట్టుకొని అలా కూర్చునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా. కనీసం ఇంట్లో హెల్ప్‌ చేయొచ్చు కదా’

- ప్రతి ఇంట్లో రోజులో ఏదో ఒక టైమ్‌లో ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. 

‘ఈ పాడు మొబైల్‌ వచ్చాక... ఈ మనిషి అసలు ఇంట్లో మనుషుల్ని పట్టించుకోవడం లేదు. ఆ మొబైల్‌ ఆరోగ్యానికి మంచిది కాదంటే వినరేం’

- ఈ మాట వినని మనిషీ ఉండరేమో!

అయితే నిపుణులు మాత్రం మొబైల్‌ మరీ మీరు అనుకున్నంత చెడ్డవి కావు అంటున్నారు. మొబైల్‌ సాయంతో హార్ట్‌ బీట్‌, స్ట్రెస్‌ లెవల్‌ లాంటి వాటిని తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఇంతకీ పరిశోధకులు ఏం అంటున్నారంటే?

స్మార్ట్‌ఫోన్‌లో ఉండే యాక్సిలోమీటర్స్‌ సాయంతో మెకానికల్‌ కార్డియాక్‌ యాక్టివిటీని తెలుసుకోవచ్చట. హార్ట్‌ వైబ్రేషన్స్‌ జనరేట్‌ చేసే ప్రతి బీట్‌ను స్మార్ట్‌ఫోన్‌ యాక్సిలోమీటర్‌ ద్వారా గణించొచ్చని చెబుతున్నారు. శరీరం మీద నిర్ణీత  ప్రదేశాల్లో మొబైల్‌ను ఉంచడం ద్వారా ఈ పని చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇటలీకి చెందిన ప్రొఫెసర్‌ ఎన్రికో కయియని నేతృత్వంలో పరిశోధనలు నిర్వహించిన బృందం ఈ వివరాలు వెల్లడించింది. ఉదయానే నిద్ర లేచిన వెంటనే పొట్ట మీద, బొడ్డు ప్రాంతంలో  స్మార్ట్‌ఫోన్‌ను ఉంచితే ఏమవుతుందనే అంశం మీద ఎన్నికో బృందం పరిశోధనలు చేసింది. ఈ క్రమంలో ఈ విషయాలు వెల్లడించింది. 

స్మార్ట్‌ఫోన్‌తో తెలుసుకున్న హార్ట్‌ రేట్‌, స్ట్రెస్‌ వివరాలు కచ్చితంగా వస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి అదే సమయంలో ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌ కూడా నిర్వహించారు. రెండింటిలో దాదాపు సమానమైన వివరాలు వచ్చాయని ఎన్రికో బృందం చెబుతోంది. దీంతో ఇక స్మార్ట్‌ఫోన్లను ఆరోగ్యాన్ని మోనిటర్‌ చేసే సాధనంగా వాడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశీలన, పరిశోధన చేయాల్సి ఉందని మరికొందరు అంటున్నారు. ఇవన్నీ త్వరగా తేలితే స్మార్ట్‌ఫోన్‌ వాడితే ఇక ఎవరూ ఏమీ అనరేమో!

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle