newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మొబైల్స్‌లో 8కె వీడియో రికార్డింగ్‌ వస్తోందట!

18-11-201918-11-2019 13:31:47 IST
2019-11-18T08:01:47.301Z18-11-2019 2019-11-18T08:01:38.456Z - - 23-04-2021

మొబైల్స్‌లో 8కె వీడియో రికార్డింగ్‌ వస్తోందట!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కెమెరా... ప్రస్తుత మొబైల్స్‌ మార్కెట్‌లో ఎక్కువగా వినిపిస్తున్న అంశం, యూజర్లు కీలకంగా చూస్తున్న అంశమూ ఇదే. ‘నీ ఫోన్‌లో ఎన్ని కెమెరాలున్నాయి’, ‘మెయిన్‌ కెమెరా మెగాపిక్సల్‌ ఎంత?’  ఏ ఇద్దరు టెక్‌ సేవీలు కలిస్తే ఇదే మాట వినిపిస్తోంది. అంతగా కెమెరా కీలకంగా మారిపోయింది. మీరూ ఇలానే ఆలోచించేవాళ్లయితే మీకో గుడ్‌ న్యూస్‌. మొబైల్స్‌లో 8కె వీడియో రికార్డింగ్‌ చేసేలా కెమెరాను రూపొందిస్తున్నారట. దీనికి సంబంధించి కొంత సమాచారం కెమెరా కోడ్‌ ద్వారా లీక్‌ అయ్యింది. ఇప్పుడు అంతర్జాతీయ గ్యాడ్జెట్స్‌ సర్కిల్స్‌లో ఇదే చర్చ జరుగుతోంది. 

కొత్త కెమెరా శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 11లో ఉండబోతోందని తాజా సమాచారం. ఫిబ్రవరిలో ఈ మొబైల్‌ మార్కెట్‌లోకి వస్తోందని తెలుస్తోంది. ఈ మొబైల్‌ కోసం శాంసంగ్‌ ప్రత్యేకమైన కెమెరాను తయారు చేస్తోందని తెలుస్తోంది. దాని ద్వారానే ఈ 8కె వీడియో రికార్డింగ్‌ వీలవుతుందని సమాచారం. సూపర్‌ హై రిజల్యూషన్‌ ఆప్షన్‌ ద్వారా ఇది వీలవుతుందట.  ఈ కెమెరాతో ఇన్నాళ్లూ 108 మెగా పిక్సల్‌ ఫొటోలు తీసుకోవచ్చని మాత్రమే వార్తలొచ్చాయి. ఇప్పుడు వీడియో రికార్డింగ్‌ విషయం బయటికొచ్చింది. 

Related image

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 11లో 20:9 యాస్పెక్ట్‌ రేషియోలో ఉండబోతోందని సమాచారం.  అయితే వీటి విషయంలో శాంసంగ్‌ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అన్నట్లు శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 10లో 19:9 యాస్పెక్ట్‌ రేషియో ఉండేది.  ఇక 108 ఎంపీ కెమెరాను శాంసంగ్‌ ఈ ఏడాది ప్రథమార్ధంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటివరకు ఏ శాంసంగ్‌ మొబైల్‌లోనూ ఈ కెమెరా కనిపించలేదు. ఇటీవల షావోమీ విడుదల చేసిన ఎంఐ నోట్‌10 ఈ కెమెరాను చూడొచ్చు.  ఆ మొబైల్‌కు కెమెరా ప్రధానాకర్షణగా నిలిచింది. అన్నట్లుగానే అదరగొట్టింది కూడా. ఇప్పుడు శాంసంగ్‌ మొబైల్స్‌లో ఇంకెంత బాగుంటుందో చూడాలి.

Image result for 8k mp camera in samsung s11 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   20 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle