newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మైక్రోసాఫ్ట్‌.. నోకియా మళ్లీ కలిశాయి..!

06-11-201906-11-2019 16:46:04 IST
2019-11-06T11:16:04.731Z06-11-2019 2019-11-06T11:15:09.349Z - - 12-04-2021

మైక్రోసాఫ్ట్‌.. నోకియా మళ్లీ కలిశాయి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్లౌడ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ రంగాల్లో పెను మార్పులు తీసుకురావడానికి రెండు అగ్రశ్రేణి టెక్‌ సంస్థలు చేతులు కలపబోతున్నాయి. మైక్రోసాఫ్ట్‌, నోకియా కలసి ఈ రంగాల్లో మరిన్ని పరిశోధనలు చేసి కొంగొత్త ఆవిష్కరణలు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు రెండు సంస్థలు అధికారికంగా వివరాలు ప్రకటించాయి. ఆయా రంగాలలో నూతన మార్పులు, ఆవిష్కరణలు చేయాలని, చేసేవారికి ఊతం అందించాలని నిర్ణయించుకున్నాయి. మైక్రోసాఫ్ట్‌ నైపుణ్యాన్ని, నోకియా శక్తిసామర్థ్యాలను జోడించి కనక్టివిటీ, ఆటోమేషన్‌ రంగాలలో నూతన మార్పులను తీసుకురావాలని నిర్ణయించుకున్నాయి.

మైక్రోసాఫ్ట్‌ - నోకియా కలసి పని చేసే విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు జేసన్‌ జాండర్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ రెండు సంస్థలు కలసి అందించే అనుసంధాన సేవలను ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు మొట్టమొదటిసారిగా బీటీ గ్రూప్‌ అనే బ్రిటిష్‌ సంస్థ అందచేయనుంది. ఆ తర్వాత మరింత విస్తృతంగా సేవలను విస్తరించేందుకు రెండు సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. రెండు సంస్థలు కలసి డిజిటల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ను మరింత వేగవంతం చేస్తాయని నోకియా ఎంటర్‌ప్రైజెస్‌ ఛీఫ్‌ స్ట్రాటజీ అధికారి కేథరిన్‌ బ్యూవాక్‌ తెలిపారు.

‘‘మైక్రోసాఫ్ట్‌ - నోకియా కలసి ఆర్థికాభివృద్ధి, అధిక ఉత్పాదకత సాధన వంటి ప్రయోజనాలను సాధిస్తాయి. దీని కోసం మేం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం’’ అని నోకియా ప్రతినిధి చెప్పుకొచ్చారు. 2014లో మైక్రోసాఫ్ట్‌, నోకియాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ వ్యాపారాన్ని ఏడు బిలియన్‌ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని మైక్రోసాఫ్ట్‌ బ్రాండ్‌ మీద కొన్ని మొబైల్స్‌ తీసుకొచ్చింది.

అయితే వాటికి ఆశించినమేర స్పందన రాలేదు. ఫీచర్‌ మొబైల్స్‌, స్మార్టఫోన్స్‌, ఫ్లాగ్‌షిప్‌ ఫోన్స్‌ అంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన స్పందన లభించలేదు. దీంతో నోకియాను 2016లో మైక్రోసాఫ్ట్ హెచ్‌.ఎం.డి. గ్లోబల్‌కు విక్రయించింది. మళ్లీ ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోసం కలసి పని చేయబోతున్నాయి.

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle