మైక్రోసాఫ్ట్ ‘కొర్టానా’ను మూసేస్తోంది
19-11-201919-11-2019 18:30:35 IST
2019-11-19T13:00:35.081Z19-11-2019 2019-11-19T13:00:32.758Z - - 17-04-2021

వాయిస్ అసిస్టెంట్లను యూజర్లు అలవాటుపడుతున్న రోజుల్లో మైక్రోసాఫ్ట్ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. తన వాయిస్ అసిస్టెంట్ కొర్టానాను మూసివేయాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజ్‌లకు మాత్రమే. మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు ఎప్పటిలాగే అందుబాటులో ఉంటుంది. 2015 ముందు వరకు కొర్టానా కేవలం విండోస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే అందరికీ అందించే క్రమంలో ఆపిల్, ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు పరిచయం చేసింది. ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోకి వెళ్లబోతోంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ మార్పు జరగబోతోంది.
వచ్చే ఏడాది జనవరి 31 నుంచి థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్ అయిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైళ్లలో కొర్టానాను నిలిపేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. కొర్టానా సర్వీసులను మెరుగుపరచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి మన దేశంతోపాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, మెక్సికో, చైనా, స్పెయిన్, కెనడాలో యాప్ స్టోర్, ప్లే స్టోర్‌లో కొర్టానా కనిపించదు. అయితే అమెరికాలో మాత్రం మరి కొద్ది రోజులు అందుబాటులో ఉంటుందని సమాచారం. దీంతోపాటు మైక్రోసాఫ్ట్ లాంచర్‌కు కొత్త అప్డేట్ తీసుకొస్తారు. ఈ అప్డేట్లో కొర్టానా ఇంటిగ్రేషన్‌ను తొలగిస్తారు.

మీరు కొర్టానా వినియోగిస్తున్నట్లయితే మీ మొబైల్లో కొర్టానాలో రిమైండర్స్గా పెట్టుకున్న అంశాలు, లిస్ట్‌లను మీ పీసీతో కనెక్ట్ చేసి సింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మైక్రోసాఫ్ట్ టు-డు యాప్ కొనసాగుతుంది. అయితే కొర్టానాను తొలగించాలనే నిర్ణయం వినియోగదారులకు పెద్ద ఇబ్బంది కలిగించే విషయం కాదని అంతర్జాతీయ టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్రభావవంతమైన వాయిస్ అసిస్టెంట్ సేవలను అందిస్తోంది. అలాగే ఐఓఎస్ వినియోగదారుల కోసం సిరి ఎలాగూ ఉంది.




గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా