మైక్రోమాక్స్ డబుల్ ధమాకా!
19-12-201819-12-2018 18:12:21 IST
2018-12-19T12:42:21.585Z19-12-2018 2018-12-19T12:42:20.082Z - - 10-04-2021

ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మైక్రోమాక్స్ ఓ ఊపు ఊపేసింది. ఇతర సంస్థల్ని వెనక్కు నెట్టేసి... నేనే నెంబర్.1 అంటూ రాజ్యమేలింది. డిఫరెంట్ ఫీచర్స్‌తో వేరే సంస్థలు ఒక కొత్త మొబైల్‌ని విడుదల చేయడమే ఆలస్యం... ఆ వెంటనే అంతకుమించిన ఫీచర్స్‌తో ఆకర్షణీయమైన మోడల్ని విడుదల చేసేది మైక్రోమాక్స్! అలాంటి ఈ సంస్థకి ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ... ఒక్కసారిగా చతికిలపడిపోయింది. ఇతర సంస్థలు తక్కువ ధరలకే ఉత్తమమైన ఫీచర్స్ అందిస్తుండడంతో... ఆ పోటీ ధాటికి ఈ సంస్థ తట్టుకోలేకపోయింది. తిరిగి ట్రాక్‌లోకి వచ్చేందుకు చాలా ప్రయత్నాలే చేసింది కానీ... అంతగా వర్కౌట్ అవ్వలేదు. దీంతో మైక్రోమాక్స్ కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత ఈ సంస్థ మళ్ళీ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది. ఉన్నతమైన ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలకే రెండు అద్భుతమైన ఫోన్స్ విడుదల చేసింది. మైక్రోమాక్స్ ఇన్ఫినిటీ N11, ఇన్ఫినిటీ N12 పేర్లతో రెండు బడ్జెట్ రేంజ్ ఫోన్స్ రిలీజ్ చేసింది. ఈ రెండు మొబైల్స్ బ్లూ లాగూన్, వయోలా బ్లాక్, వెల్వెట్ రెడ్ కలర్ వేరియెంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫినిటీ N11 ధర కేవలం రూ.8,999 కాగా... ఇన్ఫినిటీ N12 మోడల్ ధర రూ.9,999లు! పనిలోపనిగా మరో బంపరాఫర్ కూడా ఉంది. ఈ మొబైల్స్‌ను కొనుగోలు చేసిన వారికి జియో రూ.2,200 క్యాష్‌బ్యాక్‌తో పాటు 50 జిబి డేటా ఉచితంగా ఇస్తోంది.
ఇన్ఫినిటీ N11 ఫీచర్లు :
6.19 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే,
720 x 1500 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ (128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,
డ్యుయల్ సిమ్,
13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్,
డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇన్ఫినిటీ N12 ఫీచర్లు :
6.19 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే,
720 x 1500 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ (128 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,
డ్యుయల్ సిమ్,
13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
16 మెగాపిక్సల్ సెల్పీ కెమెరా,
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్,
డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
3 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా