newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

25-05-202025-05-2020 11:28:33 IST
Updated On 25-05-2020 11:37:12 ISTUpdated On 25-05-20202020-05-25T05:58:33.567Z25-05-2020 2020-05-25T05:58:08.148Z - 2020-05-25T06:07:12.981Z - 25-05-2020

మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కన్ను మూసి కన్ను తెరిచేంత లిప్తకాలంలో హెచ్ డి క్వాలిటీ గల వెయ్యి సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చంటే నమ్మబుద్ధి కాదు. కానీ అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి డిజిటల్‌ యుగంలో అసాధ్యం కానిదేదీలేదని అనేక సార్లు రుజువవుతూ వచ్చింది. ఈ క్రమంలో అనేకానేక అద్భుత ఆవిష్కరణలు పురుడు పోసుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ ఓ నిత్యావసరంగా మారిన నేటి కాలంలో, క్షణాల్లోనే సమాచారం అరచేత వాలుతున్నా మరింత వేగంగా దానిని ఒడిసిపట్టుకునే పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని మోనాశ్‌, స్విన్‌బర్న్‌, ఆర్‌ఎమ్‌ఐటీ యూనివర్సిటీలు అద్భుతం చేశాయి. 

ఒకే ఒక ఆప్టికల్‌ చిప్‌ సాయంతో 44.2 టీబీపీఎస్ ‌(టెరాబిట్స్‌‌ పర్‌ సెకండ్‌) డేటా స్పీడ్‌ను అందుకునే సాంకేతికతను అభివృద్ధి చేశాయి. ఈ డేటా స్పీడ్‌తో సెకన్‌ కంటే తక్కువ సమయంలో దాదాపు 1000 హెచ్‌డీ సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డాక్టర్‌ బిల్‌ కోర్‌కోరన్ ‌(మోనాశ్‌), ప్రొఫెసర్‌ డేవిడ్‌ మోస్‌ (స్విన్‌బర్న్‌), ఆర్‌ఎమ్‌ఐటీ ప్రొఫెసర్‌ ఆర్నన్‌ మిచెల్‌ నేతృత్వంలోని పరిశోధన బృందం ఈ అద్భుతమైన ఫీట్‌ సాధించింది. తద్వారా డేటా ఆప్టిక్స్‌, టెలికమ్యూనికేషన్స్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరతీసింది. మెల్‌బోర్న్‌ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన డార్క్‌ ఆప్టికల్స్‌ నెట్‌వర్క్ ‌(76.6 కి.మీ.) లోడ్‌ టెస్టు నిర్వహించింది. 

ఈ మేరకు తమ ఆవిష్కణకు సంబంధించిన వివరాలను ప్రఖ్యాత నేచర్‌ కమ్యూనికేషన్స్‌ జర్నల్‌లో పొందుపరిచింది. ఇక తమ టెక్నాలజీ ఆస్ట్రేలియన్‌ టెలికమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను ట్రాక్‌ చేయడానికి మాత్రమే పరిమితం కాదని... బిలియన్ల సంఖ్యలో ఇంటర్నెట్‌ కనెక్షన్లు యాక్టివ్‌గా ఉన్న సమయంలోనూ ఇదే స్థాయి స్పీడ్‌ను అందుకునేందుకు వీలుగా తమ పరిశోధన ఉపయోగపడుతుందని బృందం వెల్లడించింది. 

దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇంటర్నెట్‌ ఎలా ఉండబోతుందో తమ పరిశోధన చూచాయగా ప్రతిబింబించిందని పేర్కొంది. ఈ పరిశోధనలో తమకు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా నేషనల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఇక అత్యంత వేగంతో డేటాను డౌన్‌లోడ్‌ చేయడానికి వీలుగా తాము రూపొందించిన కొత్త పరికరంలో 80 లేజర్లతో పాటు మైక్రో- కోంబ్‌ను ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు. కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెలికమ్యూనికేషన్‌ హార్డ్‌వేర్లలో ఈ మైక్రో కోంబ్‌ అత్యంత సూక్ష్మమైన, తేలికైన పరికరం.

ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి పరిశోధకులు 80 లేజర్ల స్థానంలో ఒక సింగిల్ పరికరాన్ని చిప్ రూపంలో రూపొందించారు. దీన్ని మైక్రో బాంబ్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న టెలికమ్యూనికేష్స్ హార్డ్ వేర్‌తో పోలిస్తే ఈ మైక్రో బాంబ్ అత్యంత సూక్ష్మమైనదీ, తేలికైనదీ. ల్యాబరేటరీకి వెలుపలు ప్రస్తుతం అందుబాటులో ఉంటున్న ఇన్‌ప్రాస్ట్రక్టర్‌ను ఉపయోగించి ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన చిప్‌ను పరిశోధకులు రూపొందించారు.

పైగా క్షేత్ర పరిశోధనలో ఒక మైక్రో-బాంబ్‌ను ఉపయోగించి అత్యంత గరిష్టమైన డేటాను నిల్వ చేసే సింగిల్ ఆప్టికల్ చిప్‌‌ను రూపొందించడం ద్వారా అన్న రికార్డులనూ బద్దలు చేసినట్లు ఆస్ట్రేలియా పరిశోధక బృదం పేర్కొంది.

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle