మూడు కెమెరాలతో ముచ్చటగా నోకియా 6.2
12-10-201912-10-2019 11:22:39 IST
2019-10-12T05:52:39.373Z12-10-2019 2019-10-12T05:48:25.961Z - - 23-04-2021

భారత మార్కెట్లో ప్రీమియం మొబైల్స్ అమ్మకం ఏ రేంజులో జరుగుతోందో... బడ్జెట్ మొబైళ్ల అమ్మకమూ అదే రేంజులో జరుగుతోంది. అందుకే మొబైల్ కంపెనీలు బడ్జెట్ బ్రాకెట్ని గట్టిగా పట్టుకున్నాయి. తాజాగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లో కెమెరాల రేసులో నోకియా మరో అస్త్రాన్ని దించింది. వెనుకవైపు మూడు కెమెరాలతో ఆసక్తికరమైన మొబైల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. నోకియా 6 సిరీస్‌లో మరో మొబైల్‌ను లాంచ్ చేసింది. నోకియా 6.2 పేరుతో వచ్చిన ఈ మొబైల్లో మెరుగైన కెమెరాలు ఉంటాయని సంస్థ చెబుతోంది. నోకియా 6.2 మొబైల్లో 6.3 అంగుళాల ఫుల్ హెడ్డీ తెర ఉంటుంది. ఆండ్రాయిడ్ 9 ‘పై’ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. మొబైల్‌కు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ ఉంటుంది. ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వెనుకవైపు 16 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు. దీంతోపాటు 5 ఎంపీ డెప్త్ సెన్సర్ అందిస్తున్నారు. క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉంటుంది. 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999. అమెజాన్, నోకియా.కామ్ వెబ్సైట్లలో అమ్మకాలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్లలో శుక్రవారం నుంచి ఈ మొబైల్ అమ్మకాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం సెరామిక్ బ్లాక్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఐస్ కలర్ వేరియంట్‌ను తీసుకొస్తున్నారు. నవంబరు 30లోపు నోకియా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసినవారికి 1,500 విలువైన గిఫ్ట్ వోచర్స్ ఇస్తున్నారు. అదే ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి రూ.7,200 విలువ చేసే అదనపు ప్రయోజనాలను కల్పిస్తున్నారు.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
20 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా