newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

మీ స్మార్ట్ వాచ్ ట్యాబ్లెట్‌గా మారిపోతే..

10-07-201910-07-2019 16:01:23 IST
2019-07-10T10:31:23.875Z10-07-2019 2019-07-10T10:31:21.681Z - - 19-10-2019

మీ స్మార్ట్ వాచ్ ట్యాబ్లెట్‌గా మారిపోతే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో స్మార్ట్ వాచ్‌లు యూత్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి.  వాకింగ్, జాగింగ్ వంటి దినచర్యలను ఈ స్మార్ట్ వాచ్ ల ద్వారా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఐబీఎం కంపెనీ తాజాగా విడుదల చేసిన స్మార్ట్ వాచ్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ వాచ్ ప్రత్యేకతలు అనేకం మనకు కనిపిస్తాయి. ఈ స్మార్ట్ వాచ్ పేటెంట్ కోసం ఐబీఎం ప్రయత్నిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ మీకు అవసరం అయితే ట్యాబ్లెట్ గా మారిపోతుంది. చూడగానే ఆకట్టుకునేలా స్క్రీన్ ఉంది. యూత్ దీనికి బాగా అడిక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఏడు రకాల స్క్రీన్లు మనకు ఇక్కడ కనిపిస్తాయి. ప్రైమరీ డిస్ ప్లేతో కలిపి మొత్తం ఎనిమిది డిస్ ప్లేలు ఉంటాయి. ఈ స్మార్ట్ వాచ్ ట్యాబ్ గా మారితే దీని సైజ్ 2 x 3 అంగుళాలుగా ఉంటుంది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే 4 x 6 అంగుళాలే ఉంటుంది.

లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఆండ్రాయిడ్ ఓఎస్ ని సపోర్ట్ చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇంత స్మార్ట్ వాచ్ ట్యాబ్ గా మారిపోవడం అద్భుతంగా ఉంటుందంటున్నారు. ఈ స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి వస్తే అది మరోవింత కావడం గ్యారంటీ అంటున్నారు. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అలాంటిది స్మార్ట్ వాచ్ ట్యాబ్ అయిపోతే అంతకంటే కస్టమర్ కోరుకునేది ఏముంటుంది చెప్పండి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle